)
Harmanpreet Kaur Tattoo: ఇండియా ఉమెన్స్ టీమ్ మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవంబర్ 2న నవీ ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికాను ఓడించి హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. దీంతో సర్వత్రా భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అయితే ఈ గెలుపును ఎప్పటికి గుర్తుంచుకునేలా.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ ట్రోఫీని టాటూగా తన చేయిపై వేయించుకున్నవిషయాన్ని.. సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు గెలిచిన సంవత్సరం (2025), ఎన్ని పరుగుల తేడాతో (52 పరుగుల) గెలిచిందనే విషయాలు తెలియజేసేలా నెంబర్స్ టాటూలో ఉన్నాయి.
నా చర్మంలో, నా మనసులో ఎప్పటికీ చెక్కు చెదరదు. ఫస్ట్ డే నుంచి నీ కోసం వేచి చూస్తున్నాను. ఇక ఇప్పుడు ప్రతి రోజు లేవగానే మార్నింగ్ నిన్ను చూస్తూ ఉంటానంటూ.. టాటూను పంచుకుంటూ హర్మన్ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ కెప్టెన్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మెగాటోర్నీలో హర్మన్ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన సమయంలో ప్రత్యర్థి జట్టును ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఓపెనర్ షెఫాలీ వర్మకు బంతిని ఇచ్చింది. హర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు బాగా కలిసి వచ్చింది. ఇక కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. షెఫాలీ వర్మ కూడా వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌లో భారత్ పుంజుకునేలా చేసింది. హర్మన్ ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 32.50 సగటు 89.4 స్ట్రైక్‌రేట్‌తో 260 పరుగులు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి