ICC Champions Trophy 2025: సెమీ ఫైనల్ కు ముందు భారత్, న్యూజిలాండ్ రెండు దేశాల జట్లు మరింత ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్ళాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా గ్రూపులో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఢీ కొట్టాల్సి ఉంటుంది. భారత్ ఓడితే.. దక్షిణాఫ్రికాను మ్యాచ్ ఉంటుంది. భారత్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌తో భారత్ జట్టులో మార్పులు చేసే అవకాశం వుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా కాస్త తొడకండరాల నొప్పితో ఇబ్బందిపడ్డ రోహిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే జరిగితే పంత్ జట్టులోకి వస్తాడు. పిక్క నొప్పితో కొద్దిగా ఇబ్బంది పడ్డ షమికి కూడా విశ్రాంతినివ్వొచ్చని చర్చ జరుగుతోంది. అతడి స్థానంలో అర్ష్‌దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న వరుణ్ చక్రవర్తి.. కుల్‌దీప్ స్థానంలో ఆడే అవకాశం వుంది.
నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల్లో స్పిన్‌కు దుబాయ్ అత్యంత అనుకూలమైంది. ఈ గ్రౌండ్‌లో భారీ స్కోర్లు నమోదు కావు. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 228, పాకిస్థాన్ 241 పరుగులు మాత్రమే చేశాయి. అయితే టోర్నీలో స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు కొస్త ఇబ్బందిపడ్డారు. మధ్యాహ్నం జరుగనున్నమ్యాచ్‌తో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలను కుంటోంది. బంగ్లాదేశ్ తో పోరులో స్పిన్నర్లు మెహదీ హసన్ , రిషాద్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన భారత బ్యాటర్లు.. సాహసాలు చేయడానికి ప్రయత్నించలేదు.
పాకిస్థాన్‌పై లెగ్‌స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు. అయితే కివీస్‌కు బలమైన స్పిన్ విభాగమే ఉంది. మిచెల్ శాంట్నర్, బ్రాస్‌వెల్‌ల నుంచి టీమ్ ఇండియా బ్యాటర్లకు పరీక్ష తప్పదు. ఈ ఈవెంట్లోనే స్పిన్‌లో ఇప్పటివరకు ఇదే వాళ్లకు కఠినమైన స్పిన్ సవాలు కావొచ్చు. కివీస్ స్పిన్నర్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.
దుబాయ్‌లో క్షీణించిన పిచ్‌పై వాళ్లు మరింత ప్రభావం చూపవచ్చు. ఇప్పటివరకు స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాటర్లు ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు రాబట్టారు. పేసర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడారు. కానీ శాంట్నర్, బ్రాస్‌వెల్‌ల 20 ఓవర్లతో పాటు పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్‌నూ ఎదుర్కోవాలి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో శాంట్నర్, ఫిలిప్స్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారికి బ్రాస్‌వెల్ కూడా తోడయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బ్రాస్‌వెల్.. కేవలం 3.2 ఎకానమీ రేట్‌తో పరుగులిచ్చాడు. మందకొడి పిచ్‌పై ఈ బౌలర్లను గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
స్పిన్ విభాగంలో భారత్ కూడా బలంగానే ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌ల రూపంలో అయిదుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఈ టోర్నీలో ఆడిన జడేజా, అక్షర్, కుల్‌దీప్ పరిస్థితులకు తగినట్లు బౌలింగ్ చేసి బ్యాటర్లకు సమస్యలు సృష్టించారు. ఆ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్‌కు అయిదు కంటే ఎక్కువ పరుగులివ్వలేదు. కానీ న్యూజిలాండ్‌పై భారత స్పిన్నర్లకు భిన్నమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. విలియమ్సన్, విల్ యంగ్, లేథమ్, కాన్వే, రచిన్ రవీంద్ర చక్కటి ఫామ్‌లో ఉన్నారు. వీరిని భారత బౌలర్లు ఏమేర కట్టడి చేస్తారో చూడాలి. బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, పాక్‌పై సెంచరీ చేసి ఫామ్ అందుకున్న కోహ్లిలపై ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తన 300వ వన్డేలో కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. కివీస్‌కు మ్యాచ్ హెన్రీ, ఒరౌర్క్‌ల రూపంలో నాణ్యమైన పేస్ జోడీ కూడా ఉంది. వీరికి ఆరంభ ఓవర్లలో భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవడం కీలకం.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









