Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో మెన్ ఇన్ బ్లూ వర్సెస్ బ్లాక్ క్యాప్స్ తలపడనున్నాయి. లీగ్ దశలో కివీస్ జట్టును 44 పరుగుల తేడాతో ఓడించినా ఫైనల్‌లో ఆ జట్టును అంత తేలిగ్గా తీసుకునేందుకు లేదు. దక్షిణాఫ్రికాపై ఆ జట్టు ఆటగాళ్లు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిద్దాం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరుకున్న ఇండియా, న్యూజిలాండ్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో టీమ్ ఇండియా విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన న్యూజిలాండ్ జట్టు సెమీస్‌లో మాత్రం దక్షిణాఫ్రికాకు ఏకంగా 362 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. టీమ్ ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు న్యూజిలాండ్ 205 పరుగులకే ఆలవుట్ అయింది. 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే పటిష్టమైన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఇండియన్ బ్యాటర్లను ఎలా నియంత్రిస్తుందో చూడాలి. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ మరోసారి రెచ్చిపోతే ఫలితంగా ఎలాగైనా ఉండవచ్చు. అసలు ఈ రెండు జట్ల మధ్య వన్డేల్లో, ఐసీసీ వన్డే మ్యాచెస్‌లో , చాంపియన్స్ ట్రోఫీలో హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఐసీసీ వన్డే, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో..
మొత్తం మ్యాచ్‌లు 12. ఇండియా, న్యూజిలాండ్ చెరో ఆరింట గెలిచాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య మొత్తం 119 వన్డేలు జరిగాయి. వీటిలో ఇండియా 61 మ్యాచ్‌లలో విజయం సాధించగా, న్యూజిలాండ్ 50 గెలిచింది. 1 టైగా ముగిస్తే 7 మ్యాచ్‌లు ఫలితం లేదు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండవసారి. నైరోబీలో 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమ్ ఇండియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని క్రిస్ కెయిర్న్స్ సెంచరీతో సునాయసంగా చేధించగలిగింది.
ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లలో విజయంతో టీమ్ ఇండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. లీగ్ మ్యాచ్‌లో ఇప్పటికే కివీస్ జట్టును ఓడించింది. టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నారు. అన్నింటికి మించి దుబాయ్ పిచ్‌పై ఇండియాకు పూర్తిగా పట్టు వచ్చింది. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి దూకుడుతో ఉన్నారు. ఫీల్డింగ్ విషయంలో ఏ జట్టు సరిపోదు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్స్
ఈ మ్యాచ్ మార్చ్ 9వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది. మద్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది. జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
Also read: Ind Vs Newzeland: ఫైనల్ లో న్యూజిలాండ్ పై పోరు భారత్ వ్యూహం అదేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ దక్కేనా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









