Ind vs Nz 2025: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. రేపు మార్చ్ 9న దుబాయ్ వేదికగా మద్యాహ్నం 2 గంటలకు జరగనుంది. పిచ్ స్వభావం కాస్త క్రిటికల్ కావడంతో టాస్ కీలకం కావచ్చు. మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ తీరు మారుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫైనల్ మ్యాచ్ కావడంతో ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే జట్టులో మార్పులు అవసరమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువ మంది స్పిన్నర్లతో ఆడినట్టు ఈసారి ఆడకపోవచ్చు. మరో పేసర్ కమ్ ఆల్‌రౌండర్ అవసరముంది. అందుకే కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మొహమ్మధ్ షమితో బౌలింగ్ విభాగం సిద్ధం కావచ్చు.
ఇక బ్యాటింగ్ ఆర్డర్ అలానే ఉండే అవకాశముంది. శుభమన్ గిల్ వరుసగా విఫమౌతుండటం కాస్త ఆందోళన కల్గిస్తోంది. అయితే ఒకసారి ఫామ్‌లో వస్తే అతనికి తిరుగుండదు. అందుకే ఫైనల్‌కు మరో అవకాశం ఇవ్వవచ్చు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎప్పటిలానే అదే ఆర్డర్ కొనసాగిస్తారు. మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, అక్షట్ పటేల్ ఉండనే ఉంటారు. అంటే కేవలం బౌలింగ్ విభాగంలో ఒక్క మార్పు తప్ప మిగిలింది యధాతధంగా ఉండవచ్చు.
టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనా
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 అంచనా
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ లాథమ్, గ్లెన్ ఫిలిప్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









