Champions Trophy 2025 Ind vs Nz: 25 ఏళ్ల పగకు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా

Champions Trophy 2025 Ind vs Nz: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు  25 ఏళ్ల తరువాత టైటిల్ పోరులో తలపడనున్నాయి. నాటి పగకు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2025, 01:30 PM IST
Champions Trophy 2025 Ind vs Nz: 25 ఏళ్ల పగకు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా

Champions Trophy 2025 Ind vs Nz: దుబాయ్ వేదికగా మద్యాహ్నం 2.30 గంటలకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. టీమ్ ఇండియా తుది జట్టు ప్రకటన వచ్చేసింది. 25 ఏళ్ల క్రితం పగకు ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన కృత నిశ్చయంతో ఉంది. ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడటం ఇది రెండవసారి.

Add Zee News as a Preferred Source

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు ఇదే ట్రోఫీ ఫైనల్ టోర్నీలో తలపడటం 25 ఏళ్ల తరువాత ఇదే. 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమ్ ఇండియాను 4 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆనాటి పగకు దీటైన సమాధానం ఇచ్చేందుకు టీమ్ ఇండియా సిద్ధంగా ఉంది. అందరి దృష్టి రోహిత్ శర్మపైనే ఉంది. ఇప్పటి వరకూ టీమ్ ఇండియాను తన కెప్టెన్సీలో నాలుగు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కు చేర్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025. మహేంద్ర సింగ్ ధోనీ తరువాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన సారధిగా నిలిచేందుకు రోహిత్ శర్మ కేవలం అడుగు దూరంలోనే ఉన్నాడు. 

ఇవాళ జరిగే ఫైనల్ పోరుకు టీమ్ ఇండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోసారి రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ యధాతధంగా బరిలో దిగనున్నారు. రిషభ్ పంత్‌కు అవకాశం లేనట్టే కన్పిస్తోంది. ఒకవేళ మరో పేసర్ కమ్ ఆల్‌రౌండర్ అవసరమని భావిస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉండవచ్చు. వరుణ్ చక్రవర్తి స్థానానికి ఢోకా లేదు. మొహమ్మద్ షమీతో ఎవరు బాల్ షేర్ చేసుకుంటారో ఇంకా స్పష్టత లేదు. 

జోరుగా పందేలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుపై భారీగా పందేలు నడుస్తున్నాయి. బుకీలు రంగంలో దిగారు. టీమ్ ఇండియాపై గట్టిగా బెట్టింగ్ నడుస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతాల్లో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. దాదాపు 5 వేల కోట్లు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్టు తెలుస్తోంది. 

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనా

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 అంచనా

విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, జెమీసన్, విలియమ్ ఓ రూర్కే, మేట్ హెన్రీ లేదా నాథన్ స్మిత్

Also read: AP Summer Effect: భయపెడుతున్న ఎండలు, ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News