Ambati Rayudu Comments: ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సందడి చేశారు. చిరంజీవి, సుకుమార్, సన్నీ డియోల్‌తో పాటు నారా లోకేశ్ కూడా ప్రధాన ఆకర్షణగా మారారు. ఈ సెలెబ్రిటీలపై అంబటి రాయుడు ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు వివాదం రేపుతోంది.
యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూసిన ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ ముగిసింది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే టీమ్ ఇండియా విజయం సాధించింది. 7 ఏళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సెంచరీ కొట్టడంతో అభిమానులకు మరింత ఆనందం కలిగింది. ఈ సందర్భంగా భారీగా వచ్చిన అభిమానులతో దుబాయ్ స్టేడియం మార్మోగిపోయింది. కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే సెలెబ్రిటీలు సైతం ఇష్టపడతారు. వీలైనంతవరకూ ప్రత్యక్షంగా స్టేడియంకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిన్నటి మ్యా్ చ్ లో అదే జరిగింది. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ మరి కొందరు హల్‌చల్ చేశారు. టాలీవుడ్ నటుడు చిరంజీవి, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సందడి చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సుకుమార్, చిరంజీవిలతో కలిసి హాజరయ్యారు. చిరంజీవి, సుకుమార్, నారా లోకేశ్ మ్యాచ్‌కు హాజరవడంపై కామెంటేటర్ అవతారమెత్తిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పెద్ద వివాదమే రేపాడు.
అంతా షో కోసమే వస్తుంటారు. ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కన్పిస్తారు కదా పబ్లిసిటీ స్టంట్ అంటూ చిరంజీవి, సుకుమార్, నారా లోకేశ్‌పై వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌లో తెలుగు కామెంటేటర్లు చిరంజీవి, సుకుమార్ గురించి మాట్లాడుతున్న సమయంలో అంబటి రాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.నెటిజన్లు చాలా మంది మండిపడుతున్నారు. కొందరైతే ఏంటి రాయుడూ..పుసుక్కున అంత మాటనేశావ్ అంటున్నారు.
Ambati Rayudu about Nara Lokesh
and Chiranjeevi ?
pic.twitter.com/MepWvuOjbj— Jagan Squad (@JaganSquad2029) February 23, 2025
టీమ్ ఇండియాను సపోర్ట్ చేసేందుకు అంత దూరం నుంచి వస్తే ఇలా అవమానిస్తావా అంటూ సినీ అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి అభిమానులైతే అగ్గిమీదు గుగ్గిలం అవుతున్నారు. ఎందుకింత అహంకారం అంటూ అంబటి రాయుడిని తిడుతున్నారు. నీవే ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు.
Also read: Ind vs Pak Highlights: కసి తీర్చుకున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









