Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్

Ind vs Aus Semifinal: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశ ఇవాళ మొదలవుతోంది. మొదటి సెమీఫైనల్‌లో ఇవాళ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో విజయావకాశాలు, పిచ్ రిపోర్ట్, మార్పులు చేర్పుల గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2025, 08:59 AM IST
Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్

Ind vs Aus Semifinal: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాకౌట్ దశ వచ్చేసింది. మొదటి సెమీ ఫైనల్స్ దుబాయ్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుండగా రెండవ సెమీఫైనల్ పాకిస్తాన్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉంటుంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధమౌతోంది. 

Add Zee News as a Preferred Source

ఇవాళ జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో చేసిన ప్రయోగం విజయవంతమైనా ఇవాళ్టి మ్యాచ్‌లో ప్లాన్ మారవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాను నియంత్రించాలంటే స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా చాలా అవసరం. వరుస మూడు లీగ్ మ్యాచ్‌లు గెలవడం, దుబాయ్ పిచ్‌పై పూర్తి అవగాహన ఉండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి సత్తా చాటగా  అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో ముగ్గురిని ఆడించవచ్చు. ఇక పేసర్లు మొహమ్మద్ షమి, హర్షిత్ రాణాలతో స్పెల్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాను నియంత్రించాలంటే ట్రావిస్ హెడ్, లబుషేన్, జోష్ ఇంగ్లీష్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్ ప్రమాదకరమైన ఆటగాళ్లను ముందే కట్టడి చేయాలి. 

టీమ్ ఇండియా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. అయితే కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్ ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ పెద్దగా రాణించకపోవడమే కాకుండా క్యాచ్ డ్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో పంత్ చేరితే బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టం కావచ్చు. 

దుబాయ్ పిచ్ రిపోర్ట్

ఇదొక డెడ్లీ పిచ్. చాలా మందకొడిగా ఉండి బంతి బ్యాట్ మీదకు రానే రాదు. భారీ స్కోర్లకు అవకాశం లేదు. 260-270 పరుగులు రాబట్టడం కష్టం. స్పిన్నర్లకు మాత్రం చాలా అనుకూలమైంది. తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం వీలైనంత ఎక్కువ టార్గెట్ ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఇవాళ జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. మద్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. 

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనా

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 అంచనా

స్మిత్, ట్రావిస్ హెడ్, లబుషేన్, కనోలీ, కేరీ, మ్యాక్స్‌వెల్, ఎలిస్, స్పెన్సర్, ఆడమ్ జంపా, డ్వార్ షుయిస్ లేదా సంఘా

Also read: KKR New Captain: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా అజింక్యా రహానే, ఎవరి కెప్టెన్సీ బాగుందో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News