Champions Trophy 2025: కివీస్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో కీలక మార్పు

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. రేపు మార్చ్ 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో టీమ్ ఇండియా  జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2025, 03:35 PM IST
Champions Trophy 2025: కివీస్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో కీలక మార్పు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రేపు మార్చ్ 2 ఆదివారం దుబాయ్ వేదికగా లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు కివీస్‌ను ఓడించి పూర్తి ఆధిక్యం ప్రదర్శించాలని చూస్తోంది. 

Add Zee News as a Preferred Source

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే టీమ్ ఇండియా సెమీస్ చేరడంతో న్యూజిలాండ్‌తో రేపు జరిగే లీగ్ మ్యాచ్‌లో కొన్ని మార్పులకు సిద్ధమౌతోంది భారత జట్టు. ప్లేయింగ్ 11లో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొన్నటి వరకు కండరాల పట్టేయడంతో ఫిట్‌నెస్ లేక ఇబ్బంది పడిన రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిగా రాటుదేలి ఫామ్‌లో వచ్చేశాడు. నిన్న శుక్రవారం భారీగా ప్రాక్టీస్ చేశాడు. జ్వరంతో బాధపడుతున్న శుభమన్ గిల్ కూడా కోలుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు కొందరికి విశ్రాంతి ఇచ్చి బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచన కన్పిస్తోంది. అదే జరిగితే టాప్ పేసర్ మొహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ షమి కాస్త ఫిట్‌నెస్ సమస్యతో ఉన్నట్టు కన్పించింది. అందుకే చివరి లీగ్ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పిస్తే సెమీఫైనల్స్ మ్యాచ్‌కు పూర్తిగా కోలుకోవచ్చు. 

అందుకే రేపు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ స్థానంలో మరో పేసర్ అర్షదీప్ సింగ్‌ను ఆడించవచ్చు. ప్రస్తుతం బెంచ్‌లో ఉన్న అర్షదీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. హర్షిత్ రాణాతో పాటు అర్షదీప్ సింగ్‌ను రేపటి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలున్నాయి. మార్చ్ 4న జరిగే సెమీఫైనల్‌కు అన్ని విధాలుగా సిద్ఘంంగా ఉండాలంటే రేపటి మ్యాచ్‌లో కొన్ని మార్పులు తప్పవనే ఆలోచన ఉంది. అందుకే అర్షదీప్ సింగ్‌ను ఆడిస్తే మొహమ్మద్ షమీ సెమీస్ మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధమౌతాడు. 
అదే సమయంలో ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టును కొనసాగించవచ్చని కూడా సమాచారం అందుతోంది. 

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనా

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీ లేదా అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Also read: Summer Impact: ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు, మార్చ్ 10 నుంచే వడగాల్పుల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News