Champions Trophy 2025: వన్డే ప్రపంచకప్ 2023 ప్రతీకారం తీర్చుకోనుందా టీమ్ ఇండియా

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగిసింది. సెమీస్‌లో ఎవరెవరు తలపడతారో లెక్క తేలింది. మొదటి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపు మార్చ్ 4న జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2025, 08:08 AM IST
Champions Trophy 2025: వన్డే ప్రపంచకప్ 2023 ప్రతీకారం తీర్చుకోనుందా టీమ్ ఇండియా

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్ ఇండియా గ్రూప్ ఎలో టాప్ లో నిలిచింది. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా టాప్‌లో నిలవగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో ఆసీస్‌కు చెక్ పెట్టగలిగితే ఇక ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఇండియాదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Add Zee News as a Preferred Source

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీస్ ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమ్ ఇండియాకు ఇది రివెంజ్ టైమ్ అని చెప్పవచ్చు. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఇలానే టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. కానీ చివర్లో ఆసీస్‌తో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి లోనైంది. ఫలితంగా టైటిల్ కోల్పోయింది. ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఎ అన్ని మ్యాచ్‌లు గెలిచిన భారత్ సెమీస్‌కు చేరింది. గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీస్‌లోనే ఆస్ట్రేలియాకు చెక్ పెట్టగలిగితే ఫైనల్‌లో టీమ్ ఇండియాకు దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌పై విజయం సాధించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలవాలంటే టీమ్ ఇండియా రేపు జరిగే మ్యాచ్‌లో 2023 ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఫైనల్‌లో ఆస్ట్రేలియా కంటే దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్ జట్లతో తలపడటం ఇండియాకు సులభమౌతుంది. 

దక్షిణాఫ్రికా కూడా ఒత్తిడి తట్టుకోలేదు. టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడిన దక్షిణాఫ్రికా ఒత్తిడికి గురైన గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. ఈసారి సెమీస్‌లోనే ఆస్ట్రేలియాతో తలపడనుండటంతో ఇండియాకు కాస్త ఈజీ అవుతుంది. దీనికితోడు టీమ్ ఇండియా అన్ని విధాలుగా ఫామ్‌లో ఉంది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ రాటుదేలి కన్పిస్తోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బౌలర్ రాణిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో రావడం గమనార్హం. 

ఇక ఆస్ట్రేలియా సెమీస్ పోరుకు గట్టిగానే కష్టపడుతోంది. తుది జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్, మెక్ గుర్క్ లేదా కొన్నోలీకు చోటు దక్కవచ్చు. 

Also read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియాదేనా, ఇదే రీజన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News