Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమ్ ఇండియా మూడోసారి గెల్చుకుంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించి నిజమైన ఛాంపియన్‌లా నిలిచింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తరువాత భారత జట్టు రధ సారధి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే పుకార్లు ఈ మధ్య కాలంలో చాలా విన్పించాయి. దాంతో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసే ప్రకటన కోసం ఎదురు చూశారు. ఏడాది తిరగక ముందే మరో ఐసీసీ టైటిల్ సాధించిపెట్టిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చారు. రిటైర్మెంట్ వార్తలకు చెక్ చెప్పాడు. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ట్రోఫీ విజయంతో తనకు చాలా సంతోషంగా ఉందని, చక్కటి క్రికెట్ ఆడిన ఫలితం దక్కిందన్నారు. మొదటి నుంచి స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని, ఎప్పుడూ నిరాశపర్చలేదన్నారు. రాహుల్ మానసికంగా ధృఢంగా ఉంటాడని కీర్తించారు. ఎందుకంటే సరైన షాట్స్ ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా మ్యాచ్ ను రాహుల్ ముగించాడని చెప్పారు. అతని వల్లే పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడన్నారు. బ్యాటర్లు అంతా రాణించారని చెప్పారు. వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉందని, కీలక సమయాల్లో వికెట్ తీశాడన్నారు.
రోహిత్ భవిష్యత్ ప్రణాళిక గురించి మీడయా అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు. కోయీ ఫ్యూచర్ ప్లాన్ నహీ హై..జో చల్ రహా హై వో చలేగా అంటూ సమాధానమిచ్చారు. భవిష్యత్ ప్లాన్ ఏమీ లేదని, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని చెప్పారు.వన్డే ఫార్మట్ నుంచి రటైర్మెంట్ వార్తలను అవాస్తవంగా తేల్చారు. తన రిటైర్మెంట్‌పై ఎలాంటి పుకార్లు సృష్టించవద్దని కోరారు.
Also read: IND vs NZ Highlights: ఫైనల్‌లో దుమ్ములేపిన రోహిత్ సేన.. ఛాంపియన్స్‌గా టీమిండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









