
Champions Trophy 2025: నిజంగానే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి నిష్క్రమించాల్సిందేనా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, ఇండియాపై వరుస పరాజయాలతో పాక్ పరిస్థితి ఘోరంగా మారింది. అయితే కొన్ని సమీకరణాలు వర్కవుట్ అయితే పాకి సెమీస్ అవకాశాలు ఇంకా మిగిలి ఉంటాయంటున్నారు క్రీడా పండితులు. ఆ సాధ్యాసాధ్యాలేంటో చూద్దాం.
న్యూజిలాండ్, ఇండియాపై వరుస పరాజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ ఎ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పాకిస్తాన్ టోర్నీ నుంచి అవుట్ అనే వార్తలు వస్తున్నాయి. అటు మహీంద్ర సింగ్ ధోనీ సైతం అదే మాట చెబుతున్నాడు. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఉంటే బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ ఓడి సున్నా పాయింట్లతో ఉంది. అయితే న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు ఉన్నాయి. పాకిస్తాన్, ఇండియాలకు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. అందుకే అత్యధిక విశ్లేషకులకు పాక్ సెమీస్ అవకాశాలు లేవని, టోర్నీ నుంచి అవుట్ అని అంటున్నారు. అయితే పాకిస్తాన్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు మిగిలి ఉన్నాయని, అది పూర్తిగా ఇతర జట్ల జయాపజయాలు, రన్ రేట్ బట్టి ఉంటుందని చెబుతున్నారు. వాస్తవం కూడా అదే. పాకిస్తాన్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదు. కొన్ని సమీకరణాలు సాధ్యమైతే పాక్ సెమీస్ చేరుకోవచ్చు. ఆ సాధ్యాసాధ్యాలేంటో పరిశీలిద్దాం
పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే..
1. ఫిబ్రవరి 24 ఇవాళ న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించాలి
2. ఫిబ్రవరి 27 బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది
3. మార్చ్ 2 ఆదివారం న్యూజిలాండ్‌పై ఇండియా భారీ తేడా విజయం సాధించాలి.
ఇలా జరిగితే ఇండియా 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటుంది. మిగిలిన మూడు జట్లు రెండేసి పాయింట్లతో మిగులుతాయి. అప్పుడు ఏ జట్టుకు రన్‌రేట్ ఎక్కువగా ఆ జట్టు రెండో స్థానంలో నిలిచి ఇండియాతో పాటు సెమీస్ చేరుతుంది. అయితే న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్, ఇండియాలు గెలవడం, బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ భారీ తేడాతో విజయం తప్పనిసరి. అప్పుడే పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు తెర్చుకుని ఉంటాయి.
ఏది సాధ్యం ఏది కాదు..
అయితే పైన చెప్పిన సమీకరణాల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్, కివీస్‌పై ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నా న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం దాదాపుగా అసాధ్యం. ఇది జరగాలంటే మేజిక్ జరగాల్సిందే. న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం ఏ సమీకరణాలు పనిచేయవు. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి దేశం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి