Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియాదేనా, ఇదే రీజన్

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ దశ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని టైటిల్‌పై కన్నేసింది. అటు క్రికెట్ పండితుల విశ్లేషణల ప్రకారం చూసినా టీమ్ ఇండియాకే అవకాశాలు కన్పిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2025, 04:14 PM IST
Champions Trophy 2025:  ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియాదేనా, ఇదే రీజన్

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమ్ ఇండియా రేపు ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ కివీస్‌తో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజేతగా ఇండియాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

Add Zee News as a Preferred Source

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా ఇప్పటి వరకూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. టీమ్ ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా, అర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌తో పటిష్టంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి బలమైన బ్యాటర్లు ఉన్నారు. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు రేపు మార్చ్ 2వ తేదీ ఆదివారం నాడు దుబాయ్ వేదికగా చివరి లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఆ తరువాత సెమీ ఫైనల్స్ దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమ్ ఇండియా నిలుస్తుందని క్లార్క్ జోస్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

మైఖేల్ క్లార్క్ అభిప్రాయం ప్రకారం టీమ్ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ 1 జట్టుగా ఉంది. భారత జట్టును ఓడించడం అంత సులభమైంది కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఆడతాయి. కనీసం ఒక్క పరుగు తేడాతోనైనా టీమ్ ఇండియా విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెల్చుకుంటుంది. ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ అవుతాడని క్లార్క్ అంచనా వేశాడు. ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. విరాట్ కోహ్లీ భారీ సెంచరీతో అందర్నీ ఆకర్షించాడు. 

పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టాలనే రోహిత్ శర్మ ఆలోచన చాలా మంచిదని క్లార్క్ అభిప్రాయపడుతున్నాడు. రోహిత్ శర్మ దూకుడు ఇంకా కొనసాగుతుందని మైఖేల్ జోస్యం చెప్పాడు. అందుకే ఇప్పటి వరకు ఉన్న సాధ్యాసాధాలు పరిశీలిస్తే టీమ్ ఇండియాకే టైటిల్ అవకాశాలు ఉన్నాయంటున్నాడు క్లార్క్. 

Also read: Champions Trophy 2025: కివీస్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో కీలక మార్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News