Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ కైవసం చేసుకున్న తరువాత దేశమంతా టీమ్ ఇండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తోంది. ఒక్క ఓటమి లేకుండా అందర్నీ ఓడిస్తూ ఫైనల్‌కు చేరుకున్న తీరుకు హ్యాట్సాప్ చెప్పక తప్పదు. లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్నింటా టాస్ ఓడినా విజయం మాత్రం దూరం కాలేదు.
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకోవడంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుందనేది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రోహిత్ శర్మకు పెద్ద పీట వేయాలి. ఎందుకంటే డెడ్లీ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లతో రంగంలో దిగి ఎప్పటికప్పుడు బౌలింగ్ మార్చుతూ సమయానుకూలంగా వికెట్లు దక్కించుకుని టీమ్ ఇండియాను విజయం దిశగా నడిపించాడు. అద్భుతమైన ఫామ్‌తో అందరి నోళ్లు మూయించాడు. సీనియర్లు ఇక ఆటకు దూరం కావల్సిందే, రిటైర్‌మెంట్ ప్రకటించాల్సిందే అంటూ వచ్చిన విమర్శలు ఇప్పుడు ఆగిపోయాయి. ఎందుకంటే జట్టు విజయంలో ఆ సీనియర్లే దిక్కయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్ల, కేఎల్ రాహుల్ అవసరానికి తగ్గట్టుగా ఆడి రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగడం, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో సమాధానం చెప్పడం, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిలబడి గెలిపించడం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు విమర్శలు ఎదుర్కొన్న ఈ ముగ్గురు సీనియర్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇక టీమ్ ఇండియా విజయంలో బౌలర్లదే పైచేయి అని చెప్పాలి. ఎప్పటికప్పుడు వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి జట్లను ఇరకాటంలో పెట్టగలిగారు. ముఖ్యంగా మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తిలు చెరో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఫీట్ సాధించడం విశేషం. ఇక కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్‌తో ప్రత్యర్థుల్ని కట్టడి చేయగలిగారు. మొత్తానికి బౌలర్లు, సీనియర్లు కలిపి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలిపారు.
Also read: Yuzvendra Chahal: యుజువేంద్ర చాహల్‌తో ఆ అందమైన భామ ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









