ICC Fined To Team India: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలో తన ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు గాను ఐసీసీ చర్యలు తీసుకుంది.
నిర్ణీత సమయానికి భారత్ రెండు ఓవర్లను తక్కువగా వేసినట్లు ఐసీసీ తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక్కొ ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం రెండు ఓవర్లకు గానూ 10 శాతం ఫైన్ పడింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. అయితే చేసిన తప్పును, విధించిన శిక్షను టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించాడని.. ఇక దీనిపై ఎలాంటి తదుపరి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగ వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇక మంగళవారం అనగా రేపటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు కటక్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read: IND vs SA: రేపటి నుంచే భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









