)
Rohit Sharma: టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఆసీస్‌పై 1000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా.. హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ తన 59వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఆసీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు రెండు పరుగుల వద్ద హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, MS ధోని ఉన్నారు.
ఆసీస్ గడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియా పై అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాటర్లు వీరే..
1. రోహిత్ శర్మ-1000* రన్స్
2. విరాట్ కోహ్లీ-802 పరుగులు
3. సచిన్ టెండూల్కర్-740 పరుగులు
4. MS ధోని- 684 పరుగులు
? HISTORY BY ROHIT SHARMA ?
Rohit Sharma becomes the first Indian batter to score 1000 runs in Australia against Australia in ODI History. ? pic.twitter.com/SJizcd6yLR
— Johns. (@CricCrazyJohns) October 23, 2025
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. రోహిత్ కన్నా ముందు.. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనేలు ఈ ఘనత సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి