)
IND Vs AUS 3rd T20 2025: ఆస్ట్రేలియాలోని హోబర్ట్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సిరీస్‌ను సమం చేసింది. టీమ్ఇండియా బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ చివర్లో వచ్చి తన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఆస్టేలియా జట్టు నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బాల్స్ మిగిలుండగానే.. టీమ్ఇండియా విజయం సాధించింది.
ముందుగా టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కంగారూలు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో టిమ్ డేవిడ్ 74 రన్స్ చేయగా.. మార్కస్ స్టొయినిస్ 64 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆసీస్ బ్యాటర్లలను ఎదుర్కోవడంలో విజయం సాధించారనే చెప్పాలి. అర్ష్‌దీప్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఒక వికెట్ పడగొట్టారు.
ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి దాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (49*; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. తిలక్ వర్మ (29; 26 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (25; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమ్ఇండియా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆటను ప్రారంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి 2 ఓవర్లలో రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో దూకుడుగా ఆడాడు. కానీ, అంతలోనే నాథన్ ఎల్లిస్ వేసిన బంతికి అభిషేక్ శర్మ 25 రన్స్‌కి వెనుదిరిగాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కూడా 15 పరుగులు చేసి అదే బౌలర్ చేతిలో బలయ్యాడు. గత రెండో టీ20లోనూ విఫలమైన గిల్..ఇప్పుడు మూడో టీ20లోనూ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత బరిలో దిగిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 24 పరుగులతో ఆకట్టుకున్నా.. ఆ వెంటనే హ్యాండ్ ఇచ్చాడు. అప్పటికే విజయం పట్ల ఊగిసలాడుతున్న టీమ్ఇండియాను గాడిన పెట్టేందుకు తెలుగుతేజం తిలక్ వర్మ 29 పరుగులతో తన వంతు కృషి చేసి ఔట్ అయ్యాడు.
చివర్లో అక్షర్ పటేల్ (17 పరుగులు) చేయగా.. వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 49 పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్న సుందర్.. టీమ్ఇండియాకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా జితేశ్ శర్మ 22 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు, జేవియర్ బ్రేట్‌లెట్ ఒకటి, మార్కస్ స్టొయినిస్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయంతో సిరీస్ సమం అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook