IND vs AUS Match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
శనివారం బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆసీస్ జట్లు ఐదో టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్; 16 బంతుల్లో 6 ఫోర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
అయితే వారి విధ్వంసానికి వరుణుడు బ్రేకులు వేశాడు. 4.5 ఓవర్లకు భారత స్కోరు 52 పరుగులుగా ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపటికి కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఇక ఈ సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. రెండవ టీ20 మ్యాచ్‌లో ఆసీస్ గెలవగా.. మూడు, నాలుగవ టీ20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ భారత్ సొంతమైంది.
🚨 The 5th T20I has been called off due to rain.#TeamIndia win the series 2-1 🏆
Scorecard ▶️ https://t.co/V6p4wdCkz1#AUSvIND pic.twitter.com/g6dW5wz1Ci
— BCCI (@BCCI) November 8, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









