)
Womens World Cup 2025: భారత అమ్మాయిలు అదరగొట్టారు. పురుషుల జట్టుకు ప్రతిష్టాత్మక టోర్నీల్లో ట్రోఫీలను దూరం చేసిన ఆస్ట్రేలియాపై అమ్మాయిలు కసి తీర్చుకున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సెమీ ఫైనల్లో అమ్మాయిలు సంచలన ప్రదర్శన కనబర్చారు. దూకుడు మీద ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి ఖంగుతినిపించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అమ్మాయిలు ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచకప్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని భారత అమ్మాయిలు పొందారు. ఓటమి ఖరారు చేసుకున్న దశలో అద్భుతంగా పుంజుకుని 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను పూర్తి చేయడం విశేషం. మ్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్‌కు భారీ లక్ష్యం
ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియాలో ముంబైలో జరిగిన సెమీ ఫైనల్లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లకు ఒక్క బంతి మిగిలి ఉండగా 338 స్కోర్‌తో ఆలౌటైంది. బరిలో దిగిన కెప్టెన్ అలిస్సా హేలీ 5 పరుగులకే ఔటవగా.. ఓపెనర్ ఫోబె లిట్చ్‌ఫీల్డ్ సంచలన ప్రదర్శన చేసింది. 93 బంతుల్లో 119 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని విధించింది. ఫొబెకు సహకరిస్తూ ఆడిన ఎల్లీసే పెర్రీ 88 బంతుల్లో 77 పరుగులు చేసింది. మిడిలార్డరలో వచ్చిన అష్లే గార్డెనర్ (63) అర్థ శతకం నమోదు చేయగా.. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు.
ఆసీస్ బ్యాటర్లను తమ బంతితో భారత బౌలర్లు నిలువరించలేకపోయారు. తొలి దశలో విఫలమైన భారత బౌలింగ్ దళం తర్వాత దూకుడు కనబర్చింది. వ్యూహం మార్చుకున్న బౌలర్లు ఆసీస బ్యాటర్లను ఒక్కొక్కరిని మైదానం నుంచి పంపించేశారు. ఒక్క బంతి మిగిలి ఉండగా ఆలౌట్ చేసింది. నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, అమన్జ్యో్ కౌర, రాధా యాదవ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
జెమిమా రోడ్రిగస్ తుఫాన్
వన్డే ప్రపంచకప్ అనే చిరకాల వాంఛను నెరవేర్చుకోవాలనే కసితో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుతం చేశారు. ఐదు వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో భారత్ విజయాన్ని అందుకుని రెండోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఛేదన మెల్లగా మొదలైనా ఆఖరులో ఊహించని ఇన్నింగ్స్‌తో అమ్మాయిలు అదరగొట్టారు. ఓటమి ఖరారు చేసుకున్న దశలో గొప్పగా పుంజుకుని 9 బంతులు మిగిల్చుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.
దిగ్భ్రాంతి
ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంథాన్న (24) తక్కువ స్కోర్‌కే వెనుతిరగడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఆ సమయంలో వచ్చిన జెమిమా రోడ్రిగస్ సంచలన ప్రదర్శన చేసింది. బరిలోకి దిగిన జెమిమా మ్యాచ్ ముగిసే వరకు మైదానంలోనే ఉండి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. 134 బంతుల్లో 127 పరుగులు చేసి మొంథా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఒక్క సిక్స్ బాదకపోయినా 14 ఫోర్లతో మైదానంలో మోత మోగించింది. జెమిమాకు సహకరిస్తూ స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 89 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) విజయానికి కావాల్సిన పరుగులు అందించారు. ఓవర్లు ముగుస్తున్న కొద్దీ లక్ష్య దూరమవుతుండగా ఆఖరి ఐదు ఓవర్లలో భారత్ గేర్ మార్చి జెమిమా అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మాజీ ఛాంపియన్‌కు పరాభవం
భారత దూకుడును ఆస్ట్రేలియా బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. రెండు వికెట్ల వరకు బంతితో ప్రభావం చూపించినా తర్వాత తేలిపోయారు. అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ రెండు వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో మాజీ ఛాంపియన్‌కు ఈసారి ప్రపంచకప్ దూరమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి