)
IND vs BAN Asia Cup Live: ఆసియా కప్ 2025 క్రికెట్ సిరీస్ దాదాపు ముగిపుదశకు వచ్చేసింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరుకునేందుకు బంగ్లాదేశ్‌తో ఇది డూ-ఆర్-డై మ్యాచ్. ఈ ఉత్కంఠభరితమైన సూపర్ 4 రౌండ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క ఓటమి కూడా చవిచూడని ఏకైక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ టీమ్ఇండియా. లీగ్ రౌండ్లో భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్థాన్, ఒమన్లను సులభంగా ఓడించింది.
సూపర్ 4 రౌండ్‌లోని వారి మొదటి మ్యాచ్‌లో, టీమ్ఇండియా మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చేరుకుంది. అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ నుండి బలమైన ఓపెనింగ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు ప్రధాన బలాలుగా నిలిచాయి.
పుంజుకున్న బంగ్లాదేశ్
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు కూడా లీగ్ రౌండ్లో శ్రీలంక చేతిలో ఓడిపోయినప్పటికీ.. హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్లను ఓడించి సూపర్ 4 రౌండ్‌కు చేరుకుంది. సూపర్ 4 రౌండ్లో శ్రీలంకపై జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని.. తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో ఇప్పుడు బంగ్లాదేశ్ టీమ్.. సూర్యకుమార్ కెప్టెన్సీలోని జట్టును ఓడించేందుకు సన్నాహాలు చేస్తోంది. శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం.. టీమ్ఇండియాకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
గణాంకాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి?
T20 క్రికెట్ పరంగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 16 మ్యాచ్‌ల్లో గెలిచి పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బంగ్లాదేశ్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. గణాంకాలు భారతదేశానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇటీవలి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ సాధించిన పురోగతి ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోలేమని తెలుస్తోంది. మరోవైపు.. నిన్న జరిగిన పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఫైనల్‌కు దాదాపుగా దూరమైంది. ఈరోజు గెలిచే జట్టు ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. భారీ అంచనాలతో ఉంది.
మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది?
మ్యాచ్: ఇండియా vs బంగ్లాదేశ్, సూపర్ 4 రౌండ్, ఆసియా కప్ 2025
వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
తేదీ: సెప్టెంబర్ 24, బుధవారం
సమయం: రాత్రి 8:00 గంటలు
ప్రత్యక్ష ప్రసారం
టెలివిజన్: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్
ఆన్లైన్: SonyLIV యాప్, వెబ్సైట్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook