)
Team India Playing 11 for 1st Test: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువకులతో కూడిన టీమ్ ప్రత్యర్థితో సమరానికి సై అంటోంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడకంతో యువ జట్టు ఎలా రాణిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపటి (జూన్ 20) నుంచి లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభంకానుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు జోడిగా ఎవరు వస్తారు..? విరాట్ కోహ్లీ ఆడే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు..? అనేది ఆసక్తికరంగా మారింది. కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ముగ్గురి స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తుది జట్టులో స్థానం కోసం పోటీ భారీగానే ఉంది.
ముఖ్యంగా ఆల్‌రౌండర్ల విషయంలో ఎవరిని తీసుకుంటానేది ఇంట్రెస్టింగ్గా మారింది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్ధుల్ ఠాకూర్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. అయితే ఈ నలుగురిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తోంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్లు కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు. ఈ నలుగురిలో ఒకరు లేదా ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్‌ను పక్కనపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అంతా యువకులే ఉండడంతో రవీంద్ర జడేజాను బెంచ్‌కు పరిమితం చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైతే.. రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ నైపుణ్యంతో గట్టించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీమ్‌కు అవసరమైనప్పుడు వికెట్లు తీయగలడు.
గతేడాది జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో నితీష్ కుమార్ రెడ్డి 5 మ్యాచ్‌లలోనూ ఆడాడు. ఒక మ్యాచ్‌లో సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఆసీస్‌తో పోలిస్తే.. ఇంగ్లాండ్ పిచ్‌లు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆస్ట్రేలియా టూర్లో నితీశ్ రెడ్డి పర్ఫామెన్స్ నేపథ్యంలో తుది జట్టులో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నితీశ్ రెడ్డి టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేత అవుతుంది. అయితే బౌలింగ్ పరంగా నితీశ్ రెడ్డి సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ బలోపేతం కావాలనుంటే.. శార్దుల్ ఠాకూర్‌ను ఆడించే అవకాశం ఉంది. బుమ్రా, అర్ష్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌తోపాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.