
IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనను భారత బ్యాటర్లు మంచి ఫర్మామెన్స్ ప్రారంభించారు. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచులో భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ , శుభ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగి ఆడారు. మొదటిరోజు ఆట ముగిసే సరికి భారత మొదటి ఇన్నింగ్స్ లో 85ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ ను చేసింది. రిషభ్ పంత్ అజేయంగా అర్థ సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ ఒక్కడే నిరాశపరిచాడని చెప్పవచ్చు. ఇంగ్లండ్ బౌలర్లలో బెగ్ స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలిరోజు ఆటలో భారత జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించిందని చెప్పవచ్చు. 3 సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కు, కేఎల్ రాహుల్ అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. బౌలింగ్ కు అనుకూలంగా ఉండే ఫస్ట్ సెషన్ కండిషన్స్ లో ఓపికగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను వదిలేశారు. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టినట్లు నిలిచిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి కొట్టాడు. 91 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో నిలిచిన ఈ జోడీని బ్రైడన్ కార్స్ విడదీసాడు. కేఎల్ రాహుల్ ను క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేర్చాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన అరంగేట్ర బ్యాటర్ సాయిసుదర్శన్ బెగ్ స్టోక్స్ వేసిన తర్వాత ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. లెగ్ సైడ్ బాల్ ను గెలికి మరీ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 25.4 ఓవర్లలో 92 పరుగులు 2 వికెట్ల నష్టంతో స్కోర్ తో లంచ్ బ్రేక్ కు వెళ్లింది.
రెండో సెషన్ లో జైస్వాల్, గిల్ మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో జైస్వాల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు గిల్ దూకుడుగా బ్యాటింగ్ కు దిగాడు. దీంతో భారత స్కోర్ బోర్డును పరుగెత్తించింది. శుభ్ మన్ గిల్ 56 బంతుల్లోనే అరసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ బౌండరీల మోత మోగించాడు. 144 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన తొలి మ్యాచులో సెంచరీ చేశాడు. ఇది జైస్వాల్ కు ఐదో టెస్ట్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ 51 ఓవర్లలో 215 పరుగులు 2 వికెట్లతో టీ బ్రేక్ కు వెళ్లింది.
మూడో సెషన్ ప్రారంభంలోనే టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. జైస్వాల్ ను స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో వికెట్ కు నమోదు అయిన 129 పరుగుల భాగస్వామ్యాన్నికి తెరపడినట్లయ్యింది. రిషభ్ పంత్ వచ్చి రావడంతోనే తన ట్రేడ్ మార్క్ బౌండరీతో స్టోక్స్ ను బెంబేలెత్తించారు. మరోవైపు గిల్ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. పంత్ కాస్త స్లోగా ఆడినా గిల్ వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 140 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత పంత్ కూడా 91 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత దూకుడుగా ఆడిన పంత్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు.మొత్తానికి 85 ఓవర్లలో టీమ్ భారత్ 3 వికెట్లకు 359 పరుగులతో తొలి రోజు ఆట ముగిసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి