IND vs ENG 5th Test highlighits Day 02: ధర్మశాల టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో రెండో రోజు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (162 బంతుల్లో 103, 13 ఫోర్లు, 3 సిక్సర్లు), యంగ్ ఫ్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ (150 బంతుల్లో 110, 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలకు తోడు డెబ్యూ ప్లేయర్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (103 బంతుల్లో 65, 10 ఫోర్లు, 1 సిక్సర్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (60 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్థ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేన 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్‌ నైట్‌ స్కోరు 135/1తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు కూడా అదే జోరు కనబరిచింది. లంచ్ లోపే రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. లంచ్ తర్వాత వీరిద్దరూ ఔటయ్యారు. రోహిత్‌ను స్టోక్స్‌ ఔట్‌ చేయగా గిల్‌ను అండర్సన్‌ పెవిలియన్ కు పంపాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 171 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌,  సర్ఫరాజ్‌ ఖాన్‌లు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. తొలి టెస్టు ఆడుతున్నాననే బెరుకు లేకుండా పడిక్కల్ స్వేచ్చగా స్కోరు చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సర్ఫరాజ్‌ కూడా అర్థ శతకం సాధించాడు. పడిక్కల్, సర్పరాజ్ ఇద్దరూ మూడో వికెట్ కు 97 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీలు పూర్తయిన తర్వాత వీరిద్దరూ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యారు. 


ఆ తర్వాత రవీంద్ర జడేజా (15), ధృవ్‌ జురెల్‌ (15), అశ్విన్‌ (0)లు పెద్దగా స్కోరు చేయలేదు. కానీ కుల్‌దీప్‌, జస్ప్రిత్‌ బుమ్రా ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ (55 బంతుల్లో 27 నాటౌట్‌, 2 ఫోర్లు), జస్ప్రిత్‌ బుమ్రా (55 బంతుల్లో 19 నాటౌట్‌, 2 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 45 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బషీర్‌ నాలుగు వికెట్లు తీయగా.. టామ్‌ హర్ట్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.


Also Read: IND Vs ENG: 23 ఏళ్ళ రికార్డు సమం చేసిన జాక్ క్రాలే.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?


Also Read: Kalki 2898 AD Update: మహాశివరాత్రి నాడు సర్‌ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ప్రభాస్ పాత్ర పేరు రివీల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook