India vs New Zealand Washington Sundar Catch: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రాంచీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ అత్యధికంగా 59 పరుగులు చేయగా.. డెవాన్ కాన్వే 52 పరుగులు, ఫిన్ అలెన్ 35 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు. చివర్లో డారెల్ మిచెల్ చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ హైలెట్ అని చెప్పొచ్చు. పవర్‌ప్లేలో సుందర్ రెండు వికెట్లు తీశాడు ఈ ఆల్‌రౌండర్. 35 పరుగులు చేసి మంచి జోరు మీదున్న ఓపెనర్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసి మొదటి దెబ్బ తీశాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చి వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మార్క్ ఛాంప్‌మన్ అదే ఓవర్ చివరి బంతికి డిఫెన్స్ ఆడాడు. కొంచెం ఎత్తులో గాల్లోలేచిన బంతిని డైవ్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతంగా అందుకున్నాడు వాష్టింగ్టన్ సుందర్. 




 
సుందర్ క్యాచ్ పట్టిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సుందర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు ఆశలకు కళ్లెంపడింది. అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్.. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగంచుకున్నాడు.


Also Read: Vijayashanthi: ఆ రోజు ఏడ్చాను.. రాక్షసుడు ఎదురయ్యాడు.. టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్  


Also Read: Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి