India vs New Zealand Dream11 Team and Head to Head Records: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయంతో ఫైనల్‌కు చేరుకున్న భారత్.. ఫైనల్ పోరులోనూ కివీస్‌ను చిత్తు చేసి కప్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు గ్రూప్ దశలో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది..? హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు మీ కోసం..
పిచ్ ఇలా..
దుబాయ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు కష్టతరంగా మారింది. పవర్ ప్లేలో బంతి కొత్తగా ఉన్నప్పుడే కాస్త ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ను 270-280 స్కోర్ చేస్తే.. ఛేజింగ్ టీమ్‌కు కష్టమవుతుంది. మరోసారి స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొంత మేఘావృతం ఉన్నప్పటికీ, వర్షం అంతరాయం కలిగించదని భావిస్తున్నారు. వాతావరణ సూచన ప్రకారం 32°C అధిక ఉష్ణోగ్రత ఉంటుందని.. కనిష్ట మంచు పడే అవకాశం ఉందని అంచనా. ఇది టాస్‌ను ప్రభావితం చేయవచ్చు. టాస్ గెలిచిన టీమ్.. బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వరుసగా 14 సార్లు టాస్ ఓడిపోయిన భారత్.. ఈసారైనా టాస్ నెగ్గుతుందో లేదో చూడాలి.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. భారత్‌దే పైచేయిగా ఉంది. మొత్తం 119 మ్యాచ్‌ల్లో రెండు జట్లు తలపడగా.. టీమిండియా 61, కివీస్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగియగా.. 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. గత 10 వన్డేల్లో భారత్ ఆరింటింలో విజయం సాధించింది. ఐసీసీ ఈవెంట్స్ మ్యాచ్‌ల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. 12 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు ఇలా (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, మాట్ హెన్రీ/నాథన్ స్మిత్.
IND Vs NZ Dream11 Team Tips:
వికెట్ కీపర్లు: టామ్ లాథమ్
బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్
బౌలర్లు: మహ్మద్ షమీ, మాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తి
కెప్టెన్: రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్: వరుణ్ చక్రవర్తి
Also Read: Nagababu Assets: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు, చిరంజీవి, పవన్‌లకు ఎంత అప్పు
Also Read: Robos: ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. రంగంలోకి రోబోలు కార్మికులను వెలికితీసే కీలక ఘట్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









