)
Ind Vs Oman Highlights Asia Cup 2025: ఆసియా కప్ 2025లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించింది. పసికూన ఒమన్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విపరీతమైన ప్రయోగాలు చేయడంతో కాస్త ఉత్కంఠభరిత పోరుగా మారింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో అందరికి ప్రాక్టీస్ లభించేలా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లాన్ చేశాడు. మొదట తాను బ్యాటింగ్ కు రాకుండా ఇతర బ్యాట్స్మెన్లకు అవకాశం ఇవ్వగా.. ఆ తరువాత బౌలింగ్‌లో ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించాడు. ఒమన్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా.. అందరీ హృదయాలను గెలుచుకుంది. బౌలింగ్‌లో భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా ఆడింది. టీమిండియా బౌలర్లకు పెద్దగా వికెట్లు ఇవ్వలేదు. ఇద్దరు బ్యాట్స్మెన్లు అర్ధసెంచరీలతో మెరిశారు.
ఒకదశలో ఒమన్ సంచలనం సృష్టించేలా కనిపించింది. అయితే హార్ధిక్ పాండ్యా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మ్యాచ్ టర్న్ అయింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ జతీందర్ సింగ్ (32), అమీర్ కలీమ్ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. కలీమ్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ హమ్మద్ మీర్జా (51) కూడా భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు.
ఇక చివర్లో కాస్త హైడ్రామా నెలకొనగా.. పాండ్యా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఒమన్ జట్టుకు 14 బంతుల్లో 40 పరుగులు అవసరం కాగా.. కలీమ్ దూకుడు మీదున్నాడు. హర్షిత్ రాణా వేసిన బంతిని భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా చాలా దూరం పరిగెత్తి గాలిలో ఒంటిచెత్తో సూపర్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో ఒమన్ గెలుపు ఆశలు ఆవిరి అయ్యాయి. మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. పాండ్యా అందుకున్న క్యాచ్ నెట్టింట వైరల్ అవుతోంది.
Hardik Pandya takes a jaw-dropper to stop Kaleem in his tracks ?
Watch #INDvOMAN LIVE now on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/WgNrcBCjcu
— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025
ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 5 పరుగులకే ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కు వచ్చిన సంజు సామ్సన్.. అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. పాండ్యా (1) రనౌట్ అవ్వగా.. అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (29) రాణించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు దిగలేదు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, జితెన్ రామానంది, ఆమిర్ కలీం తలా రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సంజూ శాంసన్‌కు దక్కింది. ఈ విజయంతో భారత్ టేబుల్ టాపర్‌గా సూపర్-4లో ప్రవేశించింది. ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook