)
India Vs Pakistan Live Streaming: ఆసియా కప్‌లో నేడు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పహల్గామ్ దాడి తరువాత భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య తొలిసారి తలపడబోతున్నాయి. యూఏఈను చిత్తు చేసి భారత్.. ఒమన్‌పై గెలిచిన పాకిస్థాన్ జట్ల మధ్య పోర రసవత్తరంగా సాగనుంది. టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. భారత్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తే పాక్ చిత్తవ్వడం ఖాయం. చప్పగా.. ఎలాంటి హడావుడి లేకుండా సాగిపోతున్న ఆసియా కప్‌కు ఈ మ్యాచ్‌తో ఊపు రావడం ఖాయం. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని చాలామంది భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నా.. ఒక్కసారి మ్యాచ్ ప్రారంభం అయితే టీమిండియా గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ పిచ్ ప్రారంభంలో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్ది లైట్ల కింద బ్యాటింగ్ సులభం అవుతుంది. పేసర్లతోపాటు స్పిన్నర్లు కూడా రాణించే అవకాశం ఉంటుంది. బ్యాట్స్‌మెన్ చిన్న తప్పులు చేసినా.. ఇన్నింగ్స్ చివరిలో స్పిన్నర్లు టర్న్ చేసే అవకాశం ఉంది. వాతావరణం చాలా వేడిగా, తేమగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం Sony LIVలో అందుబాటులో ఉంటుంది. టీవీలో Sony Sports Ten 1, Sony Sports Ten 1 HD, Sony Sports Ten 5, Sony Sports Ten 5 HDలో లైవ్ చూడొచ్చు. Sony Sports Ten 3 (హిందీ), Sony Sports Ten 3 HD (హిందీ), Sony Sports Ten 4 ఛానెల్స్‌లో తమిళం, తెలుగు భాషల్లో కామెంట్రీ ఉంటుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రెండు దేశాల మధ్య 13 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ తొమ్మిదింటిలో విజయం సాధించగా.. పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. తుది జట్ల విషయానికి వస్తే.. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండా దిగే అవకాశం ఉంది. యూఏఈపై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. ఒమన్‌పై పాకిస్థాన్ బ్యాటింగ్‌లో కాస్త తడపడింది. భారత్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవాలంటే పాకిస్థాన్ అంచనాలకు మించి రాణించాల్సిందే.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.