Ravindra Jadeja: సెంచరీ చేసిన జడేజా.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?!!
IND vs SL 1st Test, Ravindra Jadeja hits Century: శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.
IND vs SL 1st Test, Ravindra Jadeja hits Century: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ (102) చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ (61) హాఫ్ సెంచరీ బాదాడు. జడేజా, అశ్విన్ ఇద్దరు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. లంక బౌలర్లు సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్రీజులో జడేజా (102), జయంత్ యాదవ్ (2) ఉన్నారు.
357/6 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియాకు రెండో రోజు మంచి ఆరంభం దక్కింది. తొలి సెషన్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు చేశారు. దాంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. ఈ జోడీని విడదీసేందుకు లంక బౌలర్లు భారీగా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రంమలోనే 97వ ఓవర్లో భారత్ స్కోరు నాలుగొందలు దాటింది.
హాఫ్ సెంచరీ ముందు వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడిన ఆర్ అశ్విన్ 106వ ఓవర్లో ఓ సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సురంగ లక్మల్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం 111వ ఓవర్లో సింగిల్ తీసిన రవి జడేజా (102) సెంచరీ చేశాడు. 112వ ఓవర్ పూర్తవగానే అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ సెషన్‌లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 111 పరుగులు చేసింది. 27 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్ పూర్తయ్యేసరికి రోహిత్ సేన 468/7 స్కోరుతో నిలిచింది. శ్రీలంక బౌలర్లు సెషన్ మొత్తం కష్టపడినా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు.
Also Read: RRR Tickets Booking: అభిమానులకు శుభవార్త.. మొదలైన 'ఆర్ఆర్ఆర్' ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్!!
Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook