IND Vs AUS Highlights: ఛాంపియన్స్ ట్రోఫీలో సమష్టి ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఐసీసీ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లకు 264 పరుగులు చేసి ఆలౌటైంది. అత్యంత ఉత్కంఠ రేపిన సెమీ పోరులో భారత జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి వన్డే ప్రపంచకప్ కసిని తీర్చుకుంది.
Also Read: IND VS AUS LIVE Score: టీమిండియాకు మరో షాక్.. అక్షర్ పటేల్ ఔట్
ఆస్ట్రేలియా విధించిన 265 సాధారణ లక్ష్యాన్ని భారత జట్టు 48.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తృటిలో శతకాన్ని చేజార్చుకుని 78 పరుగులు చేశాడు. 88 బంతుల్లో 5 ఫోర్లు బాదిన కోహ్లీ మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. శ్రేయస్ అయ్యర్ (45) రాణించగా.. కేఎల్ రాహుల్ (42) మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రోహిత్ శర్మ (28), అక్షర్ పటేల్ (27) పర్వాలేదనిపించగా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ (8) తీవ్ర నిరాశపర్చాడు.
Also Read: Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్
భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిన ఆస్ట్రేలియా బౌలర్లు ఆఖరకు మ్యాచ్‌ను అప్పగించేశారు. ప్రథమార్థం నియంత్రించిన ఆసీస్ బౌలర్లు అనంతరం కోహ్లీ దూకుడును ఆపలేకపోయారు. శ్రేయస్, కోహ్లీ కలిసి ప్రత్యర్థి బౌలర్లను ఆటాడేసుకున్నారు. ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలీ తలా ఒక్కో వికెట్‌తీశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లోనే ఇంటికి పోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులకు మింగుడు పడని విషయం.
ఆస్ట్రేలియా ఆలౌట్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లకు 264 పరుగులు చేసి ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ భారీ స్కోర్‌తో (96 బంతుల్లో 73 పరుగులు) సత్తా చాటగా.. ఆలెక్స్ కారే అర్ధ శతకం (57 బంతుల్లో 61 పరుగులు) నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషెంగ్ (29) రాణించగా.. బెన్ ద్వార్షియస్ (19) మోస్తరు స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు తలకొన్ని పరుగులు చేశారు. బౌలింగ్‌లో రాటు దేలిన భారత జట్టు ఆస్ట్రేలియాపై విరుచుకుపడింది. పరుగులను కట్టడి చేస్తూనే వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఆసీస్‌ను సాధారణ స్కోర్‌కు పరిమితం చేశారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ మూడు వికెట్లతో ఆధిపత్యం ప్రదర్శించగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కొక్క వికెట్ తీశారు.
భారత్ ప్రత్యర్థి ఎవరో?
మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. బుధవారం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్‌లో గెలిచే విజేత ఫైనల్‌లో భారత్ తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









