IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

IPL 2025: భారత్ పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు నేడు సమావేశం అయిన బీసీసీఐ ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో దేశంతో నిలవాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది. 

Written by - Bhoomi | Last Updated : May 9, 2025, 12:40 PM IST
IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ నిరవధికంగా వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీపడకూద్దన్న ఉద్దేశ్యంతోనే వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఓ వైపు దేశం యుద్ధం చేస్తుంటే..ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచులు నిర్వహించడం సరైంది కాదని వెల్లడించింది. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, మ్యాచ్ భద్రతా కారణాలవల్ల మధ్యలోనే రద్దు చేసిన విషయం తెలిసిందే. నేడు లఖ్ నవూ, ఆర్సీబీ మధ్య లఖ్ నవూలోని ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సింది. టోర్నీని వాయిదా వేసినప్పటికీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనేది మాత్రం బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. 

Add Zee News as a Preferred Source

Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. మే 9వ తేదీ శుక్రవారం పుత్తడి ఎంత తగ్గిందో తెలిస్తే పండగే..!  

కాగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ధర్మశాలలో ఉన్న పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను సిబ్బందిని అక్కడి నుంచి ఢిల్లీకి తరలించేందుకు మొదట ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది బీసీసీఐ. వందేభారత్ లో తరలించేందుకు రెడీ అయ్యింది. అయితే తాజా కథనాల ప్రకారం..ఆ రైలు వెళ్లేందుకు రైల్వేశాఖ అనుమతి లేకపోవడంతో పఠాన్ కోట్ మీదుగా వెళ్లాల్సిన నేపథ్యంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో మరో విధంగా ఆటగాళ్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ . బస్సుల్లోనే ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News