India Test Squad: భారత టెస్టు క్రికెట్ లో నూతన శకం షురూ అయ్యిందని చెప్పవచ్చు. సుదీర్ఘ ఫార్మాట్ లో రోహిత్ శర్మ, వారసుడిగా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ ను బీసీసీఐ శనివారం ఎంపిక్ చేసింది. అందరూ ముందుగానే ఊహించినట్లుగానే టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్ చేతిలో పెట్టింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలక్ట్ చేసింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూన్ 20 నుంచి ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.
కాగా గిల్ టీం ఇండియాకు 37వ టెస్ట్ కెప్టెన్ కానున్నాడు. 25 ఏళ్ల గిల్ టీం ఇండియాకు 5వ అతి పిన్న వయస్కుడైన టెస్ట్ కెప్టెన్. ఇంగ్లాండ్ గడ్డపై బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలోనూ బాగా రాణించడం ఇప్పుడు గిల్ ఎదుర్కొనే కఠినమైన సవాలు. అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. శార్దుల్ ఠాకూర్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తమ స్థానాన్ని నిలుపుకోగలిగారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ కూడా జట్టులో ఉన్నారు. IPL 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతమైన బ్యాటింగ్ చేసినందుకు సుదర్శన్ కు బహుమతి లభించింది. కరుణ్ నాయర్ 8 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చాడు. 2024-25 రంజీ ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతున్నప్పుడు అతను 863 పరుగులు చేశాడు. అందుకే ఇప్పుడు సెలెక్టర్లు అతనికి చాలా కాలం తర్వాత అవకాశం ఇచ్చారు.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
ఇంగ్లండ్లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా బుమ్రాకు మద్దతుగా ఉంటారు. స్పిన్ బౌలింగ్ బాధ్యత కుల్దీప్ యాదవ్, జడేజా భుజాలపై ఉంటుంది. భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లో జరగనుండటం గమనించదగ్గ విషయం. దీనితో, 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చక్రం ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ బర్మింగ్‌హామ్‌లో, మూడవ టెస్ట్ లార్డ్స్‌లో నాల్గవ టెస్ట్ మాంచెస్టర్‌లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్‌లోని చివరి 5వ మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది.
Also Read: IPL 2025: కన్ఫామ్ భయ్యా... మందేసి బ్యాటింగ్‌కు వచ్చాడు.. ఫ్రూఫ్‌లు ఇదిగో..!!
టీమిండియా జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్‌కే జురెల్, ధృవ్‌షింగ్‌టన్ జురెల్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook