India Vs Australia live updates : నిలకడగా ఆడుతున్న టీమిండియా, కీలకంగా మారిన రోహిత్ -కోహ్లీ భాగస్వామ్యం
లక్ష్య చేథనలో భాగంగా టీమిండియా 100 పరుగుల మార్క్ ను దాటింది
అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 17.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి టీమిండియా 100 పరుగులు సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (43), విరాట్ కోహ్లీ (20 ), పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ఆరంభ సమయంలో దూకుడుకు కనిపించిన ఓపెనర్ శిఖర్ ధావన్ (31) పరుగులకు ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో 299 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్- కోహ్లీ భాగస్వామ్యం కీలకంగా మారింది. వీరు ఇరువురు ఇదే తరహాలో నిలకడైన ఆట ప్రదర్శిస్తే టార్గెట్ ను చేధించడం సులభతరమౌతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీసేన 0-1 తేడాతో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ ను తప్పనిసరిగా కోహ్లీసేన గెలవాల్సి ఉంది.