India Vs England: ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు రెడీ అవుతున్న టీమిండియా..

India Vs England: ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు టీమిండియా జట్టు సన్నద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు లేకుండానే టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 11, 2025, 08:06 AM IST
India Vs England: ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు రెడీ అవుతున్న టీమిండియా..

India Vs England:ఐపీఎల్ సీజన్ లో టెస్ట్ సిరీస్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు లేకుండా భారత జట్టు క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు రెడీ అవుతోంది.  టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ జట్టును ఎలా నడిపిస్తాడా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

ఐదు మ్యాచుల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకుంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వటమే కాకుండా వికెట్ కీపర్ గా బీసీసీఐ ప్రకటించడంతో సామాజిక మాధ్యమాల్లో  పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినతంత మాత్రాన ఒక ప్లేయర్ పై ఓ ముద్ర వేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

చాలా సంవత్సరాల తర్వాత బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు జరగనుంది.

Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..

Also Read:  ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News