)
Shoaib Akhtar on IND vs PAK tickets: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ పోరుకు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను భారత్‌లో బహిష్కరించాలన్న పిలుపులు వచ్చినట్లు కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేశాయి. టికెట్లు అమ్ముడవ్వడం లేదని, అభిమానుల ఆసక్తి తగ్గిందని కూడా రాసాయి.
అయితే ఈ వార్తలపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయని, హౌస్‌ఫుల్ స్టేడియం ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో యుద్ధం తర్వాత మొదటిసారి తలపడుతున్న సందర్భంలో స్టేడియం ఖాళీగా ఉండటం అసాధ్యమని అక్తర్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం మీడియా ఊహాగానమే తప్ప వాస్తవం కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కరచాలనం చేసుకున్నప్పటికీ, వారిద్దరి మధ్య దూరం స్పష్టంగా కనిపించింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల ప్రతిబింబం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, క్రికెట్ మైదానంలో ఎప్పటిలాగే హీట్ ఎక్కువగా ఉండడం ఖాయంగా అని చెప్పవచ్చు. ఈ మెగా పోరుకు ముందు ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. భారత్, యూఏఈపై 9 వికెట్ల తేడాతో సులభంగా గెలుపొందింది. అదే సమయంలో, పాకిస్థాన్ ఒమన్‌ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ విజయాలు ఇరు జట్లకూ అదనపు బలాన్ని అందించాయి.
Also Read: RBI New Rule Phone Loan: ఫోన్ లోన్ ఎగ్గొడితే చిక్కులే.. ఆర్బిఐ కొత్త రూల్..లోన్ కట్టకపోతే ఫోన్లు లాక్ ..!!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పటిలాగే అభిమానులలో ఒక ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈ సారి కూడా దుబాయ్ స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోతుందని అంచనాలు ఉన్నాయి. అభిమానులు టికెట్ దొరకకపోతే కూడా లైవ్ ప్రసారాలపై ఆధారపడతారని నిపుణులు చెబుతున్నారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ పోరు కేవలం రెండు జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, రెండు దేశాల క్రికెట్ అభిమానుల గర్వం, ప్రతిష్టల మధ్య తలపోరు కూడా.
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. షోయబ్ అక్తర్ ప్రకటనలతో టికెట్లపై ఉన్న సందేహాలు తొలిగిపోయాయి. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో గెలవడంతో ఆదివారం జరగబోయే ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం చాటుకుంటుందో చూడాలి కానీ, అభిమానులకు మాత్రం ఇది ఒక క్రికెట్ పండుగలా మారబోతోందనే విషయంలో సందేహం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.