)
India VS Pakistan Match: పురుషలు వన్డే క్రికెట్ కప్ లోనే మహిళల వన్టే ప్రపంచ కప్ లో పాక్ కు భారత్ చుక్కలు చూపించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ముందుగా నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు భారత్ ఆలౌటైంది. లక్ష్యఛేదనలో పాక్.. 43 ఓవర్లలో 159 పరుగులకే చేతులెత్తేసింది. సిద్రా అమీన్ 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో చివరి వరకు పోరాడింది. నటాలియా 33, సిద్రా నవాజ్ 14 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాక్‌ను అమీన్, నటాలియా ఆదుకున్నారు. తర్వాత నటాలియా వెనుదిరిగినా.. అమీన్ ఒంటరి పోరాటం చేసింది. ఆఖరికి జట్టు స్కోరు 150 వద్ద ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగింది. కాసేపటికే పాక్ ఆలౌటైంది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 3, స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టారు.
భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆఖర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లుతో 35 పరుగులు చేశారు. మెరుపులు మెరిపించింది. జెమీమా రోడ్రిగ్స్ 32, ప్రతీకా రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధాన 23, స్నేహ్ రాణా 20, హర్మన్‌ప్రీత్ కౌర్ 19 రన్స్ చేశారు. ఓపెనర్లు ప్రతీకా, మంధాన తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. నిలకడగా ఆడిన హర్మన్‌ప్రీత్ జట్టు స్కోరు 106 వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగింది.
ఈ దశలో హర్లీన్, జెమీమా జట్టును ముందుకు నడిపించారు. అర్ధ శతకానికి చేరువైన డియోల్‌ను షమీమ్ వెనక్కి పంపడంతో 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రోడ్రిగ్స్ కూడా ఔటైపోవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. తర్వాత వచ్చిన స్నేహ్ రాణా, దీప్తి శర్మ నిలకడగా ఆడినా చివరి వరకు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ మెరుపులతో భారత్ మంచి స్కోరే సాధించింది. పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4, ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్ 2, రమీన్ షమీమ్, నష్రా సంధు ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.