)
Ind vs SA World Cup 2025 Final Updates: ప్రపంచ కప్ విజేతగా నిలిచేందుకు భారత మహిళల టీమ్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఎన్నో దశాబ్దాలుగా విశ్వకప్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా.. నేడు (ఆదివారం) సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో టైటిల్‌పై భారీ అంచనాలు పెంచేసింది. టీమిండియా విజేతగా నిలిస్తే ఓ రేంజ్లో సంబరాలు నిర్వహించేందుకు దేశం మొత్తం అభిమానులు ఇప్పటికే రెడీ అయిపోయారు. సెమీస్ వరకు పెద్దగా రాణించలేకపోయిన మన అమ్మాయిలు.. కంగారులపై వీరోచిత పోరాటంతో సంచలన విజయం అందించారు. ఇక ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి తొలిసారి విశ్వ విజేతలుగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
పిచ్ రిపోర్ట్ ఇలా..
డీవై పాటిల్ పిచ్ భారీ స్కోర్లకు పెట్టింది పేరు. ఇక్కడ బ్యాట్స్మెన్లకు పండగే. భారత్-ఆసీస్ జట్ల మధ్య సెమీస్ పోరులో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా.. భారత్ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా. ఇక్కడ స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. నవీ ముంబయిలో వర్షాలు కురుస్తుండడంతో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ డే ఉండడంతో మ్యాచ్ ఎక్కడి నుంచి ఆగిపోతే.. మరుసటి రోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. JioHotstar యాప్, వెబ్సైట్లో కూడా లైవ్ అందుబాటులో ఉంటుంది.
మన బలాలు ఇవే..
బ్యాటింగే మన టీమ్ ప్రధానం బలం. సెమీస్‌లో విఫలమైన వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు తోడు మరో ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడు ప్రదర్శిస్తే ఇక తిరుగుండదు. గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కూడా ఫామ్ అందుకోవడం, దీప్తి శర్మ, రిచా ఘోష్ మంచి టచ్‌లో ఉండడంతో బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేవు. అమన్‌జ్యోత్ నుంచి ఆల్‌రౌండ్ షో ఎక్స్పర్ట్ చేస్తున్నారు. బౌలింగ్‌లో శ్రీ చరణి, దీప్తి కీలకం కానునున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్‌ను ఆడడంలో బలహీనం. మన అమ్మాయిలు స్పిన్ అస్త్రంతోనే దెబ్బ తీస్తే.. గెలుపు సులువు అవుతుంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నరీ డెర్క్సెన్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook