హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచ కప్  ( T20 World cup ) ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ ( BCCI ) అసహనం వ్యక్తం చేస్తోంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ భవిష్యత్తుపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని ( ICC ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. కానీ సమావేశానికి తేదీ ప్రకటించే విషయంలో నిర్వాహకులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Indo China tensions: చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తోన్న లఢక్ అభివృద్ధి


ఇదిలా ఉండగా ఐపీఎల్ ( IPL 2020 ) నిర్వహణకు న్యూజిలాండ్ ముందుకు వచ్చిందని బీసీసీఐ ( BCCI ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ 2020 మార్చి 29 నుండి మే 24 వరకు జరగాల్సి ఉండగా కరోనావైరస్ విజృంభణ కారణంగా నిరవధికంగా నిలిపివేయబడిన సంగతి తెలిసిందే.. కాగా ( UAE ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ( Srilanka ) శ్రీలంక క్రికెట్ బోర్డులు ఇప్పటికే T20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తి చూపించాయి. ఇదివరకే IPL భారత్ వెలుపల రెండుసార్లు జరిగింది. దక్షిణాఫ్రికా 2009లో ఆతిథ్యం ఇవ్వగా 2014లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. 2020 ఐపీఎల్ ను రద్దు చేస్తే బోర్డు 500 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుందని ధుమల్ తెలిపారు.


 ( Also read: China Troops At LAC: భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా, గుడారాలతో సహా! )


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live