India Champions Trophy: ఒక్క మ్యాచ్ ఆడకున్నా వీళ్లంతా 'లక్కీ భాస్కర్లే..' ఎలాగో మీరే తెలుసుకోండి

India Champions Trophy: ప్రతి మ్యాచులోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఐసీసీ ట్రోఫీ గెలవాలని కలలు కంటుంటారు. కానీ ఒక్కోసారి ఐసీసీ టోర్నీలకు ఎంపికైనా..స్వ్కాడ్ లోని ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. ఇలా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Mar 31, 2025, 11:02 PM IST
India Champions Trophy: ఒక్క మ్యాచ్ ఆడకున్నా వీళ్లంతా 'లక్కీ భాస్కర్లే..' ఎలాగో మీరే తెలుసుకోండి

India Champions Trophy: ప్రతి మ్యాచులోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఐసీసీ ట్రోఫీ గెలవాలని కలలు కంటుంటారు. కానీ ఒక్కోసారి ఐసీసీ టోర్నీలకు ఎంపికైనా..స్వ్కాడ్ లోని ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. ఇలా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. 

Add Zee News as a Preferred Source

ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఈ జట్టులో యంగ్ ప్లేయర్స్ వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, అర్షదీప్ సింగ్ 15 మంది స్వాడ్ లో సెలక్ట్ అయ్యారు. టీమిండియాతోపాటు దుబాయ్ కూడా వెళ్లారు. కానీ ఈ ముగ్గురికి టోర్నీలో ఒక్క మ్యాచులో కూడా బరిలో దిగే అవకాశం రాలేదు. దీంతో వీళ్లు టోర్నీలో ఒక్క గేమ్ ఆడకున్నప్పటికీ ఛాంపియన్స్ అయ్యారు. 

అమెరికా, వెస్టిండీస్ వేదికగా గత ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగింది. ఈ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , సంజూ శాంసన్ కూడా ఈ జట్టులో సెలక్ట్ అయ్యారు. ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ నుంచి ఓటమి లేకుండా దూసుకెళ్లింది. దీంతో విన్నింగ్ కాంబినేషన్ ను మార్చే ఉద్దేశం లేకపోవడంతో చాహల్, శాంసన్ కు ఆడే అవకాశం రాలేదు. టోర్నమెంట్ అంతా బెంచ్ కే పరిమితం అయ్యారు. అలా వీళ్లు కూడా విశ్వవిజేతలు అయ్యారు. 

 టీమిండియా  2013లోనూ ఛాంపియన్స్​ ట్రోఫీ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.​ ఆ టోర్నీకి మాజీ ప్లేయర్లు వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్, అమిత్ మిశ్రా, మరళీ విజయ్ జట్టులోకి సెలక్ట్ అయ్యారు. కానీ,వీరు టోర్నమెంట్‌లో ఆడలేదు. ఆ టోర్నీలో ఈ నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగలేదు.

Also Read: Multibagger stock: కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఐదేళ్లలో లక్షకు రూ. 15లక్షల లాభం   

పియూష్ చావ్లా : లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2007 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా స్క్వాడ్‌లో ఉన్నాడు. భారత్‌ ఆ టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. అయితే చావ్లాకి ఒక్క మ్యాచ్‌లో అవకాశం రాలేదు.

జై ప్రకాష్ యాదవ్ : 2002లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌- శ్రీలంక తలపడ్డాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో రెండు టీమ్‌లు టైటిల్‌ షేర్‌ చేసుకున్నాయి. జై ప్రకాష్ యాదవ్ టోర్నీకి సెలక్ట్‌ అయ్యాడు. కానీ మ్యాచ్ ఆడలేదు.

సునీల్ వాల్సన్ : భారత్‌ తొలిసారి 1983లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీకి ఎంపికైన సునీల్‌ వాల్సన్‌కి ఒక్క మ్యాచ్‌ ఆడే ఛాన్స్ రాలేదు. 

Also Read: Minimum Bank Balance: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల బాదుడే బాదుడు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News