అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ హవా

ఐసీసీ అండర్‌-19 వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లో భారత శుభారంభం చేసింది.

Last Updated : Jan 19, 2018, 11:40 AM IST
అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ హవా

ఐసీసీ అండర్‌-19 వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లో భారత శుభారంభం చేసింది. మన కుర్రాళ్లు వరుసగా మూడో విజయం సాధించడానికి సిద్ధమయ్యారు. ఈ టోర్నిలో భాగంగా శుక్రవారం జరగుతోన్న మ్యాచ్‌లో మన టీమ్ జింబాబ్వేతో ఆడుతోంది. ఇప్పటికే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కుర్రాళ్లు 48 ఓవర్లలతో 154 పరుగులకే ఔట్ అయ్యారు. భారత బౌలర్ అంకుల్ రాయ్ 7.1 ఓవర్లలో 4 వికెట్లు తీసి యువ ఆటగాళ్ళ సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఆయనకు తోడుగా బౌలర్లు అర్షదీప్‌ సింగ్‌, అభిషేక్‌ శర్మలు కూడా చెరో రెండు వికెట్లు  తీసి, మ్యాచ్‌ను ఆసక్తికరమైన మలుపు తిప్పారు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో భారత లక్ష్యం 155 పరుగులు మాత్రమే. అండర్ 19 భారత క్రికెట్ జట్టుకి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా బాధ్యతలు  నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే

 

Trending News