IPL 2021 Prize Money: ఐపీఎల్ 2021లో విన్నర్, రన్నరప్, ఇతర అవార్డుల ప్రైజ్‌మనీ ఎంత

IPL 2021 Prize Money: IPL 2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయంతో నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ విజేతకు, ఇతర ఆటగాళ్లకు లభించే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2021, 12:12 PM IST
  • ఐపీఎల్ 2021 విన్నర్, రన్నరప్, ఇతర వ్యక్తిగత అవార్డుల ప్రైజ్‌మనీ ఎంత
  • ఐపీఎల్ 2021 విజేతకు 20 కోట్లు, రన్నర్ జట్టుకు 12.5 కోట్ల ప్రైజ్‌మనీ
  • ఐపీఎల్ 2021లో మూడు అవార్డులతో 30 లక్షలు గెల్చుకున్న హర్షల్ పటేల్
IPL 2021 Prize Money: ఐపీఎల్ 2021లో విన్నర్, రన్నరప్, ఇతర అవార్డుల ప్రైజ్‌మనీ ఎంత

IPL 2021 Prize Money: IPL 2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయంతో నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ విజేతకు, ఇతర ఆటగాళ్లకు లభించే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసుకుందాం.

IPL 2021 పోరు ముగిసింది. తొలిదశ ఇండియాలో, మలిదశ యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021(IPL 2021 Trophy)ట్రోఫీను నాలుగోసారి చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకుంది. టైటిల్‌ను మూడోసారి గెల్చుకుందామనుకున్న కేకేఆర్ ఆశలు నీరుగారిపోయాయి. ఓపెనర్లు అద్భుతంగా రాణించినా..ఆ తరువాత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో..రెండవ దశలో అద్భుతంగా రాణిస్తూ వచ్చిన కేకేఆర్(KKR) కీలకమైన మ్యాచ్‌లో విఫలమైంది. ఈ సందర్భంగా ఐపీఎల్ టైటిల్ విన్నర్, రన్నరప్ జట్లకు లభించిన ప్రైజ్‌మనీ ఎంత, ఇతర ఆటగాళ్లకు ఎంత లభిస్తుందనేది పరిశీలిద్దాం. ఏ అవార్డు అటగాడికి ఎంత ప్రైజ్‌మనీ లభిస్తుందో తెలుసుకుందాం. ఐపీఎల్ 2021(IPL 2021)లో ఎమర్జింగ్ ప్లేయర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఎక్కువ సిక్సర్లు సాధించింది ఎవరు, ఎవరికెంత అనేది చూద్దాం.

ఐపీఎల్ 2021 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్(Chennai Superkings) జట్టుకు 20 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ జట్టుకు 12.5 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు, నాలుగవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు చెరో 8.75 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఇక ఇండివిడ్యువల్ అవార్డులు, ప్రైజ్‌మనీ విషయానికొస్తే..ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలు ప్రైజ్‌మనీ అందుతుంది. ఇందులో సీఎస్‌కే టీమ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు(Ruturaj Gaikwad)ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు, ఆరెంజ్ క్యాప్ రెండు లభించడంతో 20 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ అందుతుంది. ఇక హర్షల్ పటేల్‌కు(Harshal Patel) గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యంత విలువైన ఆటగాడు, పర్పుల్ క్యాప్ అవార్డులు మొత్తం మూడు లభించాయి. దాంతో అతనికి 30 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ లభించింది. ఇక ఫెయిర్ ప్లే అవార్డును రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోవడంతో ఆ జట్టుకు పది లక్షల రూపాయల ప్రైజ్‌మనీ అందుతుంది. మరోవైపు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును దక్కించుకున్న షిమ్రోన్ హెట్ మెయిర్,  మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు సాధించిన కేఎల్ రాహుల్, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గ్రహీత వెంకటేశ్ అయ్యర్, పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు సాధించిన రవి బిష్ణోయిలు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల ప్రైజ్‌మనీ అందుతుంది. 

Also read: IPL 2021 Title Winner: ఐపీఎల్ టైటిల్ అర్హత ఆ జట్టుకే ఉంది, ధోనీ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News