Delhi Capitals: ఐపీఎల్ 2022లో కరోనా వైరస్ కలకలం.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తొలి కేసు!
IPL 2022, DC physio Patrick Farhart tests positive for Coronavirus. ఐపీఎల్ 2022లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.
IPL 2022, Delhi Capitals team physio Patrick Farhart tests positive for Coronavirus: ముంబై వేదికగా రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఐపీఎల్.. ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ప్యాట్రిక్ ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ముంబైలోని బయో సేఫ్ బబుల్‌లో ఉన్న ఫర్హత్‌కు కూరోనా సోకడంతో ఢిల్లీ ప్రాంచైజీ ఆందోళనకు గురవుతోంది.
ప్యాట్రిక్ ఫర్హత్‌కు నీరసంగా ఉండడంతో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ యాజమాన్యం అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచింది. అయితే ఫర్హత్‌కు తీవ్ర లక్షణాలు ఏమీ లేవని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ ప్రాంచైజీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు ప్యాట్రిక్ ఫర్హత్ గత రెండు రోజులుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులతో కలిసే ఉన్నాడు. ఆటగాళ్లతో ఫిట్‌నెస్‌కు సంబందించిన విషయాలు కూడా పంచుకున్నాడు. దాంతో ఢిల్లీ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఆ వివరాలు కూడా రానున్నాయి. ఇక ప్యాట్రిక్ కరోనా సోకడంతో శనివారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2022 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చిలో జరగాల్సిన మెగా టోర్నీ.. సెప్టెంబర్ మాసంలో యూఏఈలో జరిగింది. ఇక ఐపీఎల్ 2021 భారత్‌లోనే మొదలైనా దాదాపుగా సగం మ్యాచులు ముగిసేసరికి ప్లేయర్స్, సపోర్ట్ స్టాప్ వైరస్ బారిన పడడంతో.. మరోసారి యూఏఈలోనే ముగిసింది. వైరస్ తగ్గుముఖం పట్టింది కదా ఐపీఎల్ 2022 సజావుగా సాగుంతుందని భావించినా.. తొలికేసు నమోదైంది. మరి ఐపీఎల్ 2022 ఏం చేస్తుందో చూడాలి.
Also Read: TS RTC charges: బస్సు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ ఛార్జీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook