IPL 2024 Purse Details: ఐపీఎల్ 2024 వేలం ఈసారి గట్టిగానే ఉండబోతోంది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పెద్దఎత్తున స్టార్ ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. డిసెంబర్ 19 న దుబాయ్ వేదికగా జరగనున్న వేలంలో పోటీ పడనున్నాయి. ఆటగాళ్ల విడుదల తరువాత ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందో స్పష్టత వచ్చింది. వ్యాలెట్‌లో ఉన్న డబ్బుతోనే ఆయా జట్లు వేలంలో దిగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో 23 రోజుల్లో జరగనున్న ఐపీఎల్ వేలానికి మొత్తం 10 జట్లు సిద్దమౌతున్నాయి. పెద్దఎత్తున ఆటగాళ్లు విడుదల కావడమే కాకుండా ప్రపంచకప్ హీరోలుగా నిలిచిన స్టార్ ఆటగాళ్లు బరిలో ఉండటంతో ఈసారి వేలం గట్టిగా హోరాహోరీగా ఉండనుంది. వ్యాలెట్ ఎక్కువగా ఉన్న ఫ్రాంచైజీలు మంచి ఆటగాళ్లను సొంతం చేసుకోవచ్చు. ఈసారి వేలంలో ప్రపంచకప్ హీరోలుగా నిలిచిన ట్రేవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, ప్యాట్ కమ్మిన్స్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, కోయెట్జీల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడవచ్చు. అదే సమయంలో ఈ ఆరుగురు భారీ ధర పలకవచ్చు. ఈ క్రమంలో అత్యధికంగా వ్యాలెట్ కలిగిన జట్టుకు లబ్ది చేకూరనుంది. నిన్నటితో ముగిసిన ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ జాబితా ప్రక్రియ తరువాత ఏ జట్టుకు ఎంత డబ్బు మిగిలి ఉందో తేలిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


ఆర్సీబీ జట్టు ఈసారి ఏకంగా 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో జోష్ హేజిల్ వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ లిల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్ధ్ కౌల్, కేదార్ జాదవ్ ఉన్నారు. ఒకేసారి ఇంతమందిని వదిలేయడంతో ఆర్సీబీ వ్యాలెట్ భారీగా పెరిగింది. ఆర్సీబీ వ్యాలెట్‌లో ఇప్పుడు అందరికంటే అత్యధికంగా 40.75 కోట్లున్నాయి.


ఆర్సీబీ తరువాత అత్యధికంగా ఆటగాళ్లను రిలీజ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద 34 కోట్ల రూపాయలున్నాయి. ఆ తరువాత మూడో స్థానంలో 32.7 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 31.4 కోట్లు, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వద్ద 29.1 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద 28.95 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద 15.25 కోట్లు మిగిలాయి. రాజస్థాన్ రాయల్స్ వద్ద 14.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద 13.9 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద 13.85 కోట్లు ఉన్నాయి.. అందరికంటే అత్యల్పంగా వ్యాలెట్ కలిగిన జట్లు గుజరాత్, లక్నోలు. 


భారీగా ఆటగాళ్లను వదిలించుకుని వ్యాలెట్ పెంచుకున్న ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు స్టార్ ఆటగాళ్ల కోసం పోటీ పడే పరిస్థితి ఉంది. సత్తా ఉన్న ఆటగాళ్ల కోసం ఆ రెండు జట్లు ఎదురుచూస్తున్నాయి. అలాంటి ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకే బహుశా పెద్దఎత్తున రెండు జట్లు ఆటగాళ్లను వదిలించుకున్నాయని తెలుస్తోంది. అత్యధికంగా వ్యాలెట్ ఉన్నది కూడా ఈ రెండు జట్లకే కావడంతో కచ్చితంగా పోటీ పడనున్నాయి. 


Also read: IPL 2024 Updates: ఐపీఎల్ 2024 వేలంలో అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఆ ఆరుగురిపైనే, భారీగా ధర పలకనున్న ట్రేవిస్ హెడ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook