Virat Kohli: నా ఆత్మ జీవితం అంతా ఆర్సీబీకే అంకితం, కోహ్లీ భావోద్వేగం

Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఆర్సీబీ మొత్తానికి ఐపీఎల్ కప్ గెలిచింది. ఆర్సీబీ విజయంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆర్సీబీకు టైటిల్ కోసం తన జీవితాన్ని ధారపోశానన్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2025, 12:43 PM IST
Virat Kohli: నా ఆత్మ జీవితం అంతా ఆర్సీబీకే అంకితం, కోహ్లీ భావోద్వేగం

Virat Kohli: ఐపీఎల్ 2025 సీజన్ 18 ఫైనల్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన ఆర్సీబీ మొదటిసారిగా ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటే పంజాబ్ అదే 18 ఏళ్ల కలను దూరం చేసుకుంది. ఆర్సీబీ విజయంలో ప్రతి క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లి విజయాన్ని చూస్తున్నారు. విరాట్ కోహ్లీకు ఆర్సీబీకు ఉన్న బంధం అలాంటిది.

Add Zee News as a Preferred Source

ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలిచింది అనే కంటే విరాట్ కోహ్లీ కోసం కప్ సాధించిందని చెప్పడం బెటర్. ఎందుకంటే ఐపీఎల్ కెరీర్‌లో దాదాపు చాలా రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ తాను ప్రాతనిధ్యం వహిస్తున్న జట్టుకు కప్ అందించలేకపోయాడు. అందుకే ఆర్సీబీ కప్ గెల్చిన వెంటనే 18 ఏళ్ల నిరీక్షణ ముగిసిందనే క్యాప్షన్స్ అంతటా కన్పించాయి. అటు విరాట్ కోహ్లీ కూడా అంతే రీతిలో భావోద్వేగానికి లోనయ్యాడు. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ కంట కన్నీరు వస్తుండటం, టెన్షన్ పడుతుండటాన్ని కెమేరాలు స్పష్టంగా చిత్రీకరించాయి. అందుకే విజయానంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఆర్సీబీ టైటిల్ కోసం తన జీవితాన్ని దారపోశానన్న కోహ్లీ చివరి వరకు ఇదే జట్టుకు ఆడతానని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ కోసం తాను చేయగలిగింది చేశానన్నాడు. చివరి బంతి పడిన వెంటనే చాలా భావోద్వేగం కలిగిందన్నాడు. ఈ విజయం అందరు అభిమానులకు అంకితమన్నాడు. ఈ విజయం ఆర్సీబీకు ఎంత ముఖ్యమూ అబిమానులకు కూడా అంతే అవసరమని, 18 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నామని చెప్పారు. 

ఈ జట్టుకు అన్న ఇచ్చానని, ప్రతి సీజన్‌లో టైటిల్ గెలవడానికి ప్రయత్నించానని కోహ్లీ చెప్పాడు. చివరకు ఈ క్షణం రావడం నమ్మశక్యం కాని అనుభూతి అని తెలిపాడు. అందుకే చివరి బంతి వేయగానే చాలా భావోద్వేగమయ్యానన్నాడు.ఏబీ డీవిలియర్స్ ఆర్సీబీ కోసం చాలా శ్రమించాడని గుర్తు చేశాడు. ఆర్సీబీ కోసం ఏబీ డివిలియర్స్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడన్నారు. ఇప్పటికీ అత్యధిక అవార్డులు అతని పేరుతోనే ఉన్నాయన్నాడు. మేనేజ్‌మెంట్ తనకు అండగా ఉందని, తన హృదయం, ఆత్మ రెండూ బెంగళూరు జట్టుతో ఉన్నాయని చివరి వరకూ ఇదే జట్టుకు ఆడతానన్నాడు. 

Also read: AP Government: రేపే డెడ్‌లైన్, మిస్ అయితే తల్లికి వందనం దక్కదు, ఎలా చేయాలంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News