DC vs LSG Highlights: నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం చేసింది. మార్ష్ కళ్లు చెదిరే బ్యాటింగ్.. పూరన్ పూనకాలతో బ్యాటింగ్‌లో దుమ్మురేపినా కూడా అవి వృథా అయ్యాయి. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ విజయం సాధించి అబ్బుపరిచింది.
Also Read: KL Rahul Blessed Girl: తండ్రిగా కేఎల్ రాహుల్ ప్రమోషన్.. పండంటి పాపకు జన్మనిచ్చిన అతియా శెట్టి
విశాఖపట్టణంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 స్కోర్ అత్యంత వేగంగా పరుగులు రాబట్టగా.. మిచెల్ మార్ష్ అదే స్థాయిలో 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి ఒకదశలో జట్టుకు భారీ స్కోర్ అందిస్తారని అందరూ భావించారు. మెగా వేలంలో అత్యధిక ధరతో రికార్డులు తిరగరాసిన రిషబ్ పంత్ డకౌట్ కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. డేవిడ్ మిల్లర (27), మర్‌క్రమ్ (15) కొంత పరుగులు జోడించారు. భారీగా పారుతున్న లక్నో పరుగులకు ఢిల్లీ బౌలర్లు కళ్లెం వేశారు. మిచెల్ స్టార్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీయగా.. అరంగేట్ర బౌలర్ విప్రజ్ నిగమ్ ఒక వికెట్ తీయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ కూడా తీయలేదు.
Also Read: Cricket Stadium: 'మోదీ'కి చంద్రబాబు ఝలక్.. ఏపీ రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులతో అద్భుత విజయం సాధించింది. వరుస వికెట్లు పడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని దాదాపుగా ఖరారు చేసుకుంది. ఆ సమయంలో క్రీజులో ఉన్న అశుతోష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. మ్యాచ్ ఫలితాన్ని తిప్పి పడేశాడు. స్టార్ బ్యాటర్లు జెక్ ఫ్రేజర్ మెక్ గార్క్ (1), అభిషేక్ పరేల్ (0)తోపాటు మిగతా బ్యాటర్లు సమీర్ రిజ్వీ (4), మిచెల్ స్టార్క్ (2) ఇలా అతి తక్కువ స్కోర్ చేయడంతో ఢిల్లీ డీలా పడింది. విప్రజ్ నిగమ్ (39), త్రిస్టన్ స్టబ్స్ (34), ఫాఫ్ డుప్లెసిస్ (29) స్కోర్ నమోదు చేయగా.. జట్టు కష్టాల్లోఉన్నప్పుడు అశుతుష్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో ఎలాంటి కంగారు లేకుండా దూకుడైన బ్యాట్‌తో క్రీజులు కొనసాగాడు. ఒక్క వికెట్ కోల్పోతే మ్యాచ్ కోల్పోయే సమయంలో కూడా అశుతోష్ దూకుడుతో ఆడి ఢిల్లీ క్యాపిటల్స్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు.
యువ సంచలనం అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ క్లిష్ట సమయంలో నిలకడగా ఆడడం చూస్తుంటే అతడి పోరాటం సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఓటమిని ఖరారు చేసుకున్న దశ నుంచి జట్టుకు విజయం అందించడం సాధారణ విషయం కాదు. క్రీడా ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకున్న ఈ మ్యాచ్‌లో అశుతోష్ పోరాటం ఐపీఎల్‌లో గుర్తిండిపోతుంది.
ఆఖరులో లక్నో బోల్తా
దూకుడైన బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ దళాన్ని కుప్పకూల్చింది. వరుస వికెట్లు తీసి ఢిల్లీని ఓటమి వైపు నిలిచింది. అయితే ఆఖరున తడబడడంతో విజయం నుంచి ఓటమి వైపు ఢిల్లీ నిలిచింది. బౌలర్లు సమష్టి కృషి చేసి 9 వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీశారు. ఒక్క వికెట్ తీయడంలో విఫలమవడంతో లక్నో పరాజయం అందుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









