DC vs RR Super Over: నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ 'సూపర్‌' విజయం.. అసలైన మజా అంటే ఇదే!

Delhi Capitals Beats Rajasthan Royals In Super Over: ఐపీఎల్‌లో అసలైన మజా రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లభించింది. స్కోర్లు సమమైన వేళ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఆ మ్యాచ్ లో ఎవరూ విజయం సాధించారో.. సూపర్ ఓవర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 16, 2025, 11:58 PM IST
DC vs RR Super Over: నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ 'సూపర్‌' విజయం.. అసలైన మజా అంటే ఇదే!

IPL Super Over DC vs RR: క్రికెట్‌లో అసలైన మజా అంటే ఇది. నరాలు తెగే ఉత్కంఠ.. ఏ బంతికి ఏం జరుగుతుందనే ఆందోళనతో క్రికెట్‌ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురుచూశారు. స్కోర్లు సమమైన వేళ ఫలితం ఎటువైపు వెళ్తుందో.. ఏ జట్టు గెలుస్తుంది? ఏ జట్టు ఓడిపోతుందని ఆందోళన రేపగా.. చివరికి సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించి ఐపీఎల్‌లో ముందంజ వేసింది. కేఎల్‌ రాహుల్‌, త్రిస్టన్‌ స్టబ్స్‌ సూపర్బ్‌ బ్యాటింగ్‌తో జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: PBKS vs KKR Highlights: ఢిల్లీ, రాజస్థాన్‌ మ్యాచ్‌ సమం.. ఈ సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌

సూపర్‌ ఓవర్‌ ఇలా..

  • మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు బంతులకు 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌ 6, రియాన్‌ పరాగ్‌ 4 పరుగులు చేశారు. 
  • అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగిన బ్యాటర్లు వికెట్‌ కోల్పోకుండా 13 పరుగులు చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. కేఎల్‌ రాహుల్‌ 7 పరుగులు.. త్రిస్టన్‌ స్టబ్స్‌ సిక్స్‌తో సూపర్‌ విజయం అందించాడు.

Also Read: LSG vs CSK: లక్నోకు భారీ షాక్‌.. చావోరేవో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన విజయం

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి స్కోర్‌ను సమం చేసి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గార్క్‌ (9), అభిషేక్‌ పరేల్‌ (49) సత్తా చాటి ఒక్క పరుగుతో అర్థ సెంచరీని కోల్పోయాడు. కరుణ్‌ నాయర్‌ డకౌట్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ (38) రాణించగా.. త్రిస్టన్‌ స్టబ్స్‌ 34 పరుగులు చేశాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ 34 స్కోర్‌ చేయగా.. అశుతోష్‌ శర్మ 15 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాజస్థాన్‌ బౌలర్లు బంతితో చక్కటి బౌలింగ్‌ వేసి పరుగులను నియంత్రించారు. వికెట్లు తీస్తూనే పరుగులను కంట్రోల్‌ చేశారు. జోఫ్రా ఆర్చర్‌ 2 వికెట్లు, మహీశ్‌ తీక్షణ, వహింద్‌ హసరంగా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి మ్యాచ్‌ ఫలితం తేలకుండా నిలిపింది. ప్రత్యర్థికి దీటుగా ఆడినా కూడా ఫలితం తేలలేదు. యశస్వి జైస్వాల్‌ 37 బంతుల్లో 51 పరుగులు చేయగా.. కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ 31 స్కోర్‌ చేశాడు. రియాన్‌ పరాగ్‌ (8) తక్కువ స్కోర్‌ చేయగా..  నితీశ్‌ రాణా 28 బంతుల్లో 51 పరుగులు చేసి సంచలన ప్రదర్శన చేశాడు. ధ్రువ్‌ జురేల్‌ (26), షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ (15*) రాణించి మ్యాచ్‌ను టై చేశారు. తమపై ప్రతాపం చూపిన రాజస్థాన్‌పై అదే స్థాయిలో ఢిల్లీ బౌలర్లు ప్రతాపం చూపారు. అయితే పరుగులను నియంత్రిస్తూనే వికెట్లు తీయడంలో కొంత తడబడ్డారు. అయినా కూడా మ్యాచ్‌ను ఉత్కంఠ రేపేలా చేశారు. 8 మంది బౌలింగ్‌ వేయగా.. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మిచెల్‌ స్టార్క్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News