IPL 2025 Final: ఐపీఎల్ 2025 పైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరగనుంది. క్వాలిఫయర్ 1లో పంజాబ్‌పై విజయంతో ఆర్సీబీ, క్వాలిఫయర్ 2లో ముంబైపై విజయంతో పంజాబ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్లకు ఇదే తొలి టైటిల్ కానుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీకు మాత్రం 18 ఏళ్లుగా తీరని కోరిక ఇది.
పంజాబ్ కింగ్స్ లెవెన్ వర్సెస్ ఆర్సీబీ రెండు జట్లకు ఇదే తొలి టైటిల్ అవుతుంది. అయినా సరే ఆర్సీబీపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఆ జట్టు మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. ఆర్సీబీ కప్ గెలిచిందంటే విరాట్ కోహ్లీ విజయం సాధించినట్టే. 18 ఏళ్ల కోహ్లి నిరీక్షణకు తెరపడనుంది. 18 ఏళ్ల కోరిక నెరవేరనుంది. ఐపీఎల్ పైనల్స్‌కు చేరడం ఆర్సీబీకు ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2009, 2011, 2016లో పైనల్‌కు చేరినా టైటిల్ చేజిక్కించుకోలేక రన్నరప్‌గా మిగిలిపోయింది. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లి ఫామ్ కూడా బాగుంది. 14 మ్యాచ్‌లలో 614 పరుగులు చేశాడు. గత సీజన్‌లో కూడా ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే.
2009లో ఆర్సీబీ మొదటి సారి ఫైనల్ ఆడినప్పుడు కోహ్లి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 2011లో ఫైనల్ ఆడినప్పుడు 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇక 2016లో 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఆర్సీబీ కప్ సాధించడం అనేది ఆ జట్టుకే కాదు విరాట్ కోహ్లీకు 18 ఏళ్ల సుదీర్ఘ కల. అందుకే ఈసారి కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడవచ్చని తెలుస్తోంది. కోహ్లీ ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అవుతుందనేది కూడా అందరికీ తెలుసు. అందుకే అందరూ కోహ్లీపై ఆశలు పెట్టుకున్నారు.
18వ నెంబర్ జెర్సీతో 18 ఏళ్లుగా కప్ కోసం కోహ్లీ నిరీక్షణ ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టుని ఒక్కసారైనా ఛాంపియన్‌గా నిలపాలని పోరాటం చేస్తున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 266 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 8,618 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 5 సీజన్లలో 600 దాటి పరుగులు చేశాడు. అందుకే ప్రతి ఏటా చెబుతూ వస్తున్న ఈ సాలా కప్ నమ్దే...ఈసారికి సాధ్యం కావచ్చంటున్నారు.
Also read: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ వర్షం రద్దయితే ఎవరికి లాభం, విజేత ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









