RCB: ఆర్సీబీకి మైండ్‌ బ్లాక్.. ఐపీఎల్ 2025 ట్రోఫీ వెనక్కి ఫిక్స్? కారణం ఇదే...!!

IPL 2025 Final: 18ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరింది. విరాట్ కోహ్లీ కల సాకారమైంది. ఎట్టకేలకు ఐపీఎల్ 2025 టోర్నీ ఆర్సీబీ వశమైంది. ఫైనల్ మ్యాచులో పంజాబ్ ను ఓడించి మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ఆర్సీబీ. ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు..సీన్ కట్ చేస్తే..ఐపీఎల్ 2025 ట్రోఫీని వెనక్కి తీసుకునేందుకు ఫిక్స్ అయ్యింది.   

Written by - Bhoomi | Last Updated : Jun 5, 2025, 11:40 AM IST
RCB: ఆర్సీబీకి మైండ్‌ బ్లాక్.. ఐపీఎల్ 2025 ట్రోఫీ వెనక్కి ఫిక్స్? కారణం ఇదే...!!

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన విషయం తెలిసిందే. 18ఏళ్ల  కలను సాకారం చేసుకుంది. ఆర్సీబీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలోకి వేసుకుంది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగులు తేడాతో ఓడించింది. అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ చారిత్రక విజయం తర్వాత బెంగళూరులో భారీ విజయోత్సవ సంబురాలను జరిపింది ఫ్రాంచైజీ. 

Add Zee News as a Preferred Source

ఇదంతా పక్కన పెడితే..ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ నుంచి వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. దానికి కారణం ఏంటంటే..ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ఏ జట్టుకైనా అసలు ట్రోఫీని ఇవ్వరు. కేవలం ఆ ట్రోఫీ నమూనాను మాత్రమే అందిస్తారు. ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత మొదటిసారిగా ఆ ఫ్రాంచైజీకి అసలు ట్రోఫీని ఇచ్చారు. కానీ ఆ పై దాని స్థానంలో నమూనాను ఇచ్చారు. ఆ రిపబ్లికా ట్రోఫితోనే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నది. 

ఆర్సీబీ విక్టరీకి మద్దతుగా కర్నాటక సర్కార్ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కర్నాటక విధానసభ భవనం దగ్గర ఆర్సీబీ టీమ్ ను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్, సీఎం  సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోపాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ఆర్సీబీ విక్టరీ పరేడ్..చిన్న స్వామి స్టేడియం వరకు కొనసాగాల్సి వచ్చింది.

Also Read: 10-Star Hotel: ప్రపంచంలోని సగం మందికి ఈ 10 స్టార్ హోటల్ గురించి తెలియదు.. ఒక నైట్ ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!  

అయితే ఒక వైపు కర్నాటక విధాన సభ భవనం దగ్గర సన్మాన కార్యక్రమం కొనసాగుతుండగానే..చిన్నస్వామిస్టేడియానికి జనం భారీగా తరలివచ్చారు. స్టేడియం దగ్గర ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించి..ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దాంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈప్రమాదంపై విచారణకు ఆదేశించారు కర్నాటక ముఖ్యమంత్రి. మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షల పరిహారం ప్రకటించారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News