Hardik vs Jasmin: ఆ ఇద్దరి ఎఫైర్ నిజమే, ముంబై ఇండియన్స్ బస్సులో హల్‌చల్ చేసిన జాస్మిన్ వాలియా

Hardik vs Jasmin: గర్ల్ ఫ్రెండ్స్..లవర్స్ ఈ రెండూ ఎప్పుడూ క్రికెట్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఏకంగా ముంబై ఇండియన్స్ బస్సెక్కేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2025, 08:25 PM IST
Hardik vs Jasmin: ఆ ఇద్దరి ఎఫైర్ నిజమే, ముంబై ఇండియన్స్ బస్సులో హల్‌చల్ చేసిన జాస్మిన్ వాలియా

Hardik vs Jasmin: జాస్మిన్ వాలియా రోజ్..ఇప్పుడు క్రికెట్ వీధుల్లో ఈ పేరే చర్చనీయాంశమౌతోంది. ప్రముఖ బ్రిటీష్ రియాలిటీ షో ది ఓన్లీ వే ఈజ్ ఎస్సెక్స్ ఫేమ్ అయిన జాస్మిన్ ఇటీవల టీమ్ ఇండియా క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. 

Add Zee News as a Preferred Source

ముంబై ఇండియన్ సారధి హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నాయిస్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లలో సందడి చేస్తోంది. హార్దిక్ పాండ్యా ఎక్కడ ఆడుతుంటే అక్కడికి వాలిపోతోంది. నిన్న సోమవారం జరిగిన కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో తళుక్కుమంది. అంతేకాకుండా కేకేఆర్ జట్టుపై విజయం తరువాత ఆ టీమ్ బస్సులో ప్రత్యక్షమైంది. స్టాండ్స్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సపోర్ట్ చేస్తూ చిల్ చేసింది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2025 లో కూడా జాస్మిన్ వాలియా ఫోటోలు, వీడియో తొలిసారిగా సోషల్ మీడియాలో వైర్ అయ్యాయి. 

స్ట్రైప్డ్ షర్ట్, నెర్డీ గ్లాస్‌లో హల్‌చల్ చేయడంతో ఇద్దరి మద్య బంధంపై వస్తున్న పుకార్లకు బలం చేకూరింది. ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా వేదికల్లో ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడాన్ని గమనించిన ఫ్యాన్స్ పుకార్లు ప్రారంభించారు. ఇద్దరూ గ్రీస్‌లో వెకేషన్ గడిపారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్‌డ్రాప్ గ్రీస్ నేపధ్యం ఉండటం దీనికి కారణం. గత ఏడాది 2024 జూలైలో విడిపోతున్నట్టుగా హార్దిక్ పాండ్యా, నతాషా స్టాన్ కోవిక్ ప్రకటించాక హార్దిక్ వర్సెస్ జాస్మిన్ బంధంపై పుకార్లు మొదలయ్యాయి. నాలుగేళ్లు కలిసి ఉన్న తరువాత ఇద్దరూ అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, కలిసి ఉండాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఇది కఠిన నిర్ణయమైనా తప్పడం లేదని ఇద్దరూ ప్రకటించారు. 

ఇప్పుడు హార్దిక్ పాండ్యాతో తిరుగుతున్నట్టుగా భావిస్తున్న కొత్త గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వాలియా రోజ్ తమ బంధాన్ని క్లియర్ చేసేసింది. కేకేఆర్ జట్టుపై విజయం తరువాత ముంబై ఇండియన్స్ టీమ్ బస్ ఎక్కి హల్‌చల్ చేసింది.

జాస్మిన్ వాలియా రోజ్ బ్రిటీష్ రియాలిటీ షో ది ఓన్లీ వే టు ఎస్సెక్స్‌‌తో ఫేమ్ తెచ్చుకుంది. 2017లో హిట్ అయిన బోమ్ డిగ్గీ విత్ జాక్ నైట్ పాటతో ప్రాచుర్యం పొందింది. బిగ్‌బాస్ 13 ఫైనలిస్ట్ ఆసిమ్ రియాజ్‌తో కలిసి 202లో నైట్స్ ఎన్ ఫైట్స్ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది. 

Also read: School Holidays: విద్యార్ధులకు బంపర్ న్యూస్, ఏప్రిల్‌లో అన్నీ సెలవులే, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News