Kavya Maran Shock: గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన సన్‌రైజర్స్ మళ్లీ బోల్తా కొట్టింది. మరో సంచలన ప్రదర్శన ఉంటుందని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూడగా ఆరెంజ్ ఆర్మీ పూర్తి నిరాశపర్చింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటం చేయకుండా చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో బద్దకం.. సత్తువ లేని బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో నెగ్గి సొంత గడ్డపై ముంబై మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
Also Read: DC vs RR Super Over: నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ 'సూపర్' విజయం.. అసలైన మజా అంటే ఇదే!
తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. టాపార్డర్లు బ్యాట్ ఝుళిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పవర్ ప్లేలో రికార్డు స్కోర్ చేసిన బ్యాటర్లు తడబడ్డారు. గత మ్యాచ్ సెంచరీవీరుడు అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 28 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటవగా.. ట్రావిస్ హెడ్ 28 పరుగులకే పరిమితమవగా.. ఇషాన్ కిషన్ 2 పరుగులకే ఔటవడంతో ఆరెంజ్ ఆర్మీకి భారీ దెబ్బ తగిలింది. నితీశ్ కుమార్ రెడ్డి (19) భారీ స్కోర్ చేయలేకపోగా.. హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులతో పర్వాలేదనిపించాడు. యువ బ్యాటర్ అనికెట్ వర్మ చివర్లో మెరుపులతో 18 పరుగులు చేయగా.. పాట్ కమిన్స్ (8) ఆఖర్లో సిక్స్‌తో ఇన్నింగ్స్ పూర్తి చేశాడు.
Also Read: PBKS vs KKR Highlights: నిప్పులు చెరిగిన బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై పంజాబ్ విజయం
తమ సొంత గడ్డపై ముంబై బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారీ స్కోర్‌పై కన్నేసిన ఆరెంజ్ ఆర్మీని తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. మొదటి బంతి నుంచి ఆఖరి బంతి వరకు పరుగుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన ముంబై బౌలర్లు తమ వ్యూహంలో విజయం సాధించారు. విల్ జాక్స్ 2 వికెట్లతో సత్తా చాటగా.. సీనియర్ బౌలర్ బుమ్రాతోపాటు బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా ఒక్కో వికెట్ తీశారు.
బద్ధకంగా స్కోర్ బోర్డు
తక్కువ స్కోర్ ఛేదించడానికి బరిలో దిగిన ముంబై ఇండియన్స్ సునాయమాసంగా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. 18.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి బ్యాటర్ల మాదిరిగానే ముంబై బ్యాటర్లు కూడా పరుగులు తీసేందుకు కష్టపడ్డారు. ఏ బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేక తడబడి 6 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. రియాన్ రికల్టన్ (31), రోహిత్ శర్మ (26), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26) తక్కువ స్కోర్ అయినా కూడా విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేయగా.. నమన్‌ధీర్ పరుగు చేయకుండానే వెనుదిరగా.. తిలక్ వర్మ 21 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.
సన్‌రైజర్స్ బౌలర్లు విఫలం
బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా విఫలమై తక్కువ లక్ష్యం విధించగా దానిని కాపాడడంలో సన్‌రైజర్స్ బౌలర్లు విఫలమై కీలకమైన మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. వికెట్లు తీయడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ఒక్క వికెట్ తీయకపోవడం గమనార్హం. కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లు తీసి విజృంభించినా ఫలితం లేకపోయింది. ఈషాన్ మలింగ్ రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు.
ఒక్క పరుగు కోసం నిరీక్షణ
స్కోర్‌ను సమం చేసిన వేళ ఒక్క పరుగు కోసం ముంబై ఇండియన్స్ దాదాపు పది నిమిషాలు ఎదురుచూసింది. ఈషాన్ మలింగ్ వేసిన 17వ ఓవర్ అద్భుతంగా మారింది. ఆ ఓవర్‌లో రెండు వికెట్లు దక్కాయి. ఒక్క పరుగు తీసేందుకు హార్దిక్ పాండ్యా సిక్స్‌కు ప్రయత్నించగా అది ఇషాన్ కిషన్ చేతిలో పడింది. దీంతో పాండ్యా విన్నింగ్ షాట్ ఆడదామనే ఆశ తీరలేదు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ నమన్ ఎల్‌బీడబ్ల్యూ కావడంతో ముంబై అభిమానులు షాక్‌కు గురయ్యారు. గెలుపు ముందర రెండు వికెట్లు ఏమిటని విస్తుపోయారు. ఒక్క పరుగు రాకపోవడమేమిటని పిచ్చిలేసిన తిలక్ వర్మ 18వ ఓవర్ తొలి బంతికే బ్యాట్‌ను ఉన్నఫళంగా తిప్పేసి వెనకకు పంపించాడు. దాంతో ఫోర్ లభించగా ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం దక్కింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









