IPL 2025 KKR vs GT: శుభమన్‌ గిల్‌ మెరుపులు.. కోల్‌కత్తాపై గుజరాత్‌ భారీ విజయం

Gujarat Titans Beat Kolkata Knight Riders By 39 Runs: ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొడుతోంది. వరుస మ్యాచ్‌లను గెలుస్తూ దూకుడుగా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కోలకత్తా నైట్‌రైడర్స్‌ను భారీ తేడాతో ఓడించింది. కీలక విజయాన్ని అందుకున్న టైటాన్స్‌ అగ్రస్థానంలో దూసుకెళ్లింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 22, 2025, 12:56 AM IST
IPL 2025 KKR vs GT: శుభమన్‌ గిల్‌ మెరుపులు.. కోల్‌కత్తాపై గుజరాత్‌ భారీ విజయం

KKR vs GT Highlights: అద్బుతమైన విజయాలతో దూకుడుగా వెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌ సంచలన ప్రదర్శన చేస్తోంది. కోలకత్తాపై భారీ విజయాన్ని సొంతం చేసుకుని తిరుగులేని జట్టుగా నిలిచింది. శుభమన్‌ గిల్‌ కొద్దిలో సెంచరీ మిసవగా.. కోలకత్తా సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక తడబడింది. 39 పరుగుల భారీ తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకోగా.. కోలకత్తా నైట్‌రైడర్స్‌ మరో పరాజయాన్ని పొందింది. ఈ సీజన్ లో అత్యధిక విజయాలు పొందుతున్న గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది.

Add Zee News as a Preferred Source

Also Read: RCB vs PBKS: విరాట్‌ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు భారీ విజయం.. ప్లేఆఫ్‌ రేసులో ముందంజ

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ 36 బంతుల్లో 52 పరుగులు చేయగా.. శుభమన్‌ గిల్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేసి దుమ్మురేపాడు. 3 సిక్సర్లు, 10 ఫోర్లతో గిల్‌ చెలరేగి ఆడాడు. 23 బంతుల్లో 41 పరుగులు చేయగా.. రాహుల్‌ తెవాటియా డకౌటవగా.. షారూక్‌ ఖాన్‌ 11 స్కోర్‌ చేశాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ బౌలర్లు పరిమితంగా బౌలింగ్‌ చేసినా పరుగులకు అడ్డుకట్టవేయలేకపోయారు. వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రానా, ఆండ్రె రస్సెల్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: RR vs LSG: యశస్వి జైస్వాల్‌ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై 2 పరుగుల తేడాతో లక్నో ఉత్కంఠ విజయం

టైటాన్స్‌ విధించిన భారీ లక్ష్యాన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ 159 పరుగులు చేసింది. రహన్ముల్లా గుర్బాజ ఒక పరుగుకే ఔటవగా.. సునీల్ నరైన్‌ 17 పరుగులు చేశాడు. కెప్టెన్‌ అజింక్యా రహానే 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5 ఫోర్లు ఒక సిక్సర్‌ బాది అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (14), రింకూ సింగ్‌ (17), ఆండ్రె రస్సెల్‌ (21), రఘువంశీ (27) పరుగులు చేయగా.. మొయిన్‌ అలీ డకౌట్‌ అయ్యాడు. బ్యాటర్లందరూ విఫలమవడంతో కోల్‌కత్తాకు మరో ఓటమి ఖాయమైంది.

మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం
బ్యాటర్లు నిలిపిన లక్ష్యాన్ని గుజరాత్‌ బౌలర్లు చక్కగా కాపాడారు. ఆది నుంచి కోల్‌కత్తా బ్యాటర్లను స్కోర్‌ చేయకుండా నిలువరించారు. స్కోరు బోర్డును కదలనివ్వకుండా చేసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రసిధ్ కృష్ణ మరోసారి తన బౌలింగ్‌తో మెరిశాడు. ప్రసిధ్‌, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్ల చొప్పున తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, సాయి కిశోర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టి జట్టు విజయంలో భాగమయ్యారు.

అగ్రస్థానంలో టైటాన్స్‌
సీజన్‌ ఆరంభం నుంచి అదిరిపోయే ఆటతో గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలను అందుకుంటోంది. టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ 6 విజయాలతో సీజన్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2 ఓటములు చెందినా కూడా ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్‌ దశకు టైటాన్స్‌ చేరుకుందని చెప్పవచ్చు. మాజీ చాంఫియన్‌ కోల్‌కత్తా ఈ మ్యాచ్‌ ఓటమితో 5 ఓటములను ఖాతాలో వేసుకోగా.. మూడింటిని కైవసం చేసుకుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో అత్యధికంగా ఓటములు ఉన్నా కూడా ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో చేసే ప్రదర్శనను బట్టి ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News