LSG vs MI: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై ఓటమి.. లక్నోకు మరో విజయం

Lucknow Super Giants Won By 12 Runs Against Mumbai Indians: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్‌ జరగ్గా ముంబై ఇండియన్స్‌ పోరాడి ఓటమి చెందగా.. లక్నో సూపర్‌ జియాంట్స్‌ తన ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది. లక్నో వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ ఉత్కంఠగా జరిగింది. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 4, 2025, 11:57 PM IST
LSG vs MI: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై ఓటమి.. లక్నోకు మరో విజయం

LSG vs MI Highlights: ఐపీఎల్‌ 2025లో ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఓటమి నుంచి తప్పించుకుని విజయం సాధించగా.. విజయం అంచుల దాకా వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది. హార్దిక్‌ పాండ్యా ఐదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేయగా.. జట్టు ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఫలితంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన సూపర్‌ జియాంట్స్‌ 203 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 191 స్కోర్‌ చేసి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: KKR vs SRH Live: సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి.. సొంత గడ్డపై పరువు నిలబెట్టుకున్న కోల్‌కత్తా

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (31 బంతుల్లో 60) అర్థ శతకం పూర్తి చేసుకోగా.. ఐడెన్‌ మార్‌క్రమ్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆయుశ్‌ బదౌనీ (30) సత్తా చాటగా మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా సంచలన ప్రదర్శన చేసి ఐదు వికెట్లు కొల్లగొట్టాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, విగ్నేష్‌ పుతూర్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అయితే వికెట్లు తీయడంలో విజయవంతమైనా స్కోర్‌ బోర్డును నియంత్రించలేకపోయారు. హార్దిక్‌ మినహా అందరి బౌలిగ్‌లో భారీ పరుగులు లభించాయి.

Also Read: RCB vs GT Highlights: గురువుకు శిష్యుడి షాక్‌.. బెంగళూరు జోరుకు గుజరాత్‌ బ్రేక్‌!

లక్నో విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లు ముగిసినా ముంబై సాధించలేకపోయింది. 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయానికి దూరంగా నిలిచింది. ఈ సీజన్‌లో తొలిసారి సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. బంతులు అధికంగా మింగినా కూడా 67 పరుగులు సాధించాడు. నమన్‌ ధీర్‌ (46), హార్దిక్‌ పాండ్యా (28*) మోస్తరు పరుగులు సాధించారు. లక్నో బౌలర్లు తమ స్కోర్‌ను కాపాడుకునేందుకు శక్తికి మించి ప్రదర్శన చేయగా తుదకు విజయం సాధించారు. బౌలర్లు సమష్టి కృషి చేసి వికెట్లు పడగొట్టారు. దిగ్వేష్‌ సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అవేశ్‌ ఖాన్‌, ఆకాశ్‌ దీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఒక దశలో చూస్తే ముంబైకి ఇది భారీ లక్ష్యమే. దాదాపు విజయం అసాధ్యమే అనుకున్న సమయంలో బ్యాటర్లు తీవ్రంగా శ్రమించి విజయం అంచుల దాకా తీసుకెళ్లారు. ఆఖరు ఓవర్‌ పూర్తి ఉత్కంఠ రేపింది. హార్దిక్‌ పాండ్యా స్ట్రైక్‌లో ఉండడంతో విజయం పక్కా అని ముంబై అభిమానులు భావించారు. కానీ సాధ్యం కాలేకపోయింది. విజయం కాకున్నా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్తుందని ఆశించగా.. ఆశ నెరవేరలేదు. దీంతో పాండ్యా కొంత అసహనానికి లోనయ్యాడు. రెండు సార్లు బ్యాట్‌ను ప్యాడ్‌కు కొట్టాడు. దగ్గరి దాకా వచ్చి ఓడిపోవడం ముంబై అభిమానులను జీర్ణించుకోకుండా చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News